AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami 2023: జన్మాష్టమిన రాత్రి చేసే పూజ అత్యంత ఫలవంతం .. ఆర్ధిక కష్టాలు తీరడానికి ఈ పరిహారాలు చేసి చూడండి

శ్రీకృష్ణుడు ఆ భక్తుడిపై అపారమైన ఆశీర్వాదాలను కురిపిస్తాడని విశ్వాసం. సనాతన సంప్రదాయంలో శ్రీ విష్ణువు 8వ అవతారంగా పరిగణించబడే శ్రీ కృష్ణుడిని ఆరాధించాలని అనేక నియమాలు సూచించారు. వీటిని అనుసరిస్తూ పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతాడు. జన్మాష్టమి రోజున రాత్రి కన్నయ్యను పూజించాల్సిన నియమాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

Janmashtami 2023: జన్మాష్టమిన రాత్రి చేసే పూజ అత్యంత ఫలవంతం .. ఆర్ధిక కష్టాలు తీరడానికి ఈ పరిహారాలు చేసి చూడండి
Janmashtami
Surya Kala
|

Updated on: Sep 06, 2023 | 10:34 AM

Share

శ్రీకృష్ణుని జన్మదినాన్ని ప్రతి సంవత్సరం పెద్ద పండుగగా దేశ విదేశాల్లో ఉన్న కన్నయ్య భక్తులు ఘనంగా  జరుపుకుంటారు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ పవిత్ర పండుగలో నియమాల ప్రకారం కృష్ణుడిని  పూజించడం ద్వారా కష్టాలు రెప్పపాటులో తొలగిపోతాయని.. శ్రీకృష్ణుడు ఆ భక్తుడిపై అపారమైన ఆశీర్వాదాలను కురిపిస్తాడని విశ్వాసం. సనాతన సంప్రదాయంలో శ్రీ విష్ణువు 8వ అవతారంగా పరిగణించబడే శ్రీ కృష్ణుడిని ఆరాధించాలని అనేక నియమాలు సూచించారు. వీటిని అనుసరిస్తూ పూజించడం ద్వారా వ్యక్తి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతాడు. జన్మాష్టమి రోజున రాత్రి కన్నయ్యను పూజించాల్సిన నియమాల గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

పసుపు రంగు బట్టలు: హిందూ విశ్వాసం ప్రకారం శ్రీ కృష్ణుడు పసుపు రంగును చాలా ఇష్టపడతాడు. వీటిని  ధరించడం వల్ల అతన్ని పీతాంబరధారి అని కూడా పిలుస్తారు. జన్మాష్టమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజిస్తే శ్రీకృష్ణుడు త్వరలో సంతుష్టుడై కోరిన వరాలను ప్రసాదిస్తాడని నమ్మకం. జన్మాష్టమి నాడు పసుపు వస్త్రాలు, ఆహారం, పూలు, పండ్లు మొదలైన వాటిని దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

శంఖం: హిందూ విశ్వాసం ప్రకారం శ్రీ విష్ణువు, అతని అవతారమైన శ్రీ కృష్ణుని ఆరాధనలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. శంఖం ఉపయోగించడం విశేషంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి జన్మాష్టమి రోజు రాత్రి దక్షిణావర్తి శంఖాన్ని నీరు, పాలతో నింపి, శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తే ఆ వ్యక్తిపై గోవర్ధన గిరి ధారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతాడు. అంతేకాదు అతని ఇల్లు ఏడాది పొడవునా సుఖ సంపదలు, ధన ధాన్యాలతో నిండి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కుంకుమ పరిహారం: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. ఎంత కష్టపడినా ఆర్ధిక ఇబ్బందులతో ఉన్నా .. డబ్బుకు లోటుతో ఉంటే.. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు రాత్రి శ్రీ కృష్ణ భగవానుడికి కుంకుమపువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. హిందూ విశ్వాసం ప్రకారం కుంకుమపువ్వుతో చేసే పరిహారం ఆ వ్యక్తి ఆనందం, అదృష్టం, సంపదను పెంచుతుంది.

తులసితో పరిహారం: హిందూ విశ్వాసం ప్రకారం తులసి లేని శ్రీకృష్ణుని కోసం చేసే పూజలు,  ఆయనకు సమర్పించే నైవేద్యాలు అసంపూర్ణం. అటువంటి పరిస్థితిలో జన్మాష్టమి రోజున కన్నయ్య అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకంగా తులసిని పూజించి స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణ చేయండి. కన్నయ్య నైవేద్యంలో తులసి దళాన్ని కూడా చేర్చండి.

బాధలు తొలగిపోవడానికి: హిందూ విశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి జన్మాష్టమి రోజున రాధా-కృష్ణుల ఆలయానికి వెళ్లి ప్రత్యేకంగా పూజించాలి. కన్నయ్యకు పసుపు రంగు పూలను సమర్పించడం ద్వారా అతని బాధలు తొలగిపోతాయని.. ఎటువంటి కోరికలు కోరినా నెరవేరుతాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)