AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఈ చెట్టులో మహిమ ఉందట.. అలా మధ్యలో నుంచి దూరితే సర్వరోగాలు మటుమాయమట

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసు నగర్ గ్రామ అటవీ ప్రాంతంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చింత చెట్టు ఉంది. ఈ చెట్టు మధ్యలో నుంచి చిన్న పిల్లలను, పెద్ద వాళ్ళను దూర్చితే వారి రోగాలు మటుమాయం అవుతాయని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెట్టును దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆ ప్రాంతంలో ఎన్నో అరుదైన మూలికలు ఉన్నాయనీ స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి

Telangana: ఈ చెట్టులో మహిమ ఉందట.. అలా మధ్యలో నుంచి దూరితే సర్వరోగాలు మటుమాయమట
Tamarind Tree
G Sampath Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 06, 2023 | 11:03 AM

Share

ఈ చెట్టులో మహిమ ఉంది. ఈ చెట్టు మధ్యలో నుంచి దూరితే దీర్ఘకాల రోగాలు మటాష్  దూరడం కష్టంగా ఉన్నా…అతి కష్టం మీద వెళ్తున్నారు. ఎప్పుడు చూసిన జనాల హడావిడి. ఈ చింత చెట్టుకు వంద సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చెట్టు దిగువ భాగంలో భారీ రంద్రం ఉంటుంది.. మనిషి.. ఈ చెట్టు రంధ్రం నుంచి దాటాలంటే చాలా కష్టం.. అయితే ఈ చెట్టుకు మహిమ ఉందని.. చెట్టు మధ్య నుంచి.. అటు.. ఇటు వెళ్తున్నారు జనాలు. ఇలా చెట్టు మధ్యలో నుంచి.. దూరి వెళ్తే మంచి జరుగుతుందని జనం నమ్ముతున్నారు. శ్రావణ మాసం.. ఇక్కడ భక్తుల సందడి ఉంటుంది.. ఈ ఆధ్యాత్మిక చెట్టు ఎక్కడ ఉందో తెలుసుకుందాం పదండి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాసు నగర్ గ్రామ అటవీ ప్రాంతంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చింత చెట్టు ఉంది. ఈ చెట్టు మధ్యలో నుంచి చిన్న పిల్లలను, పెద్ద వాళ్ళను దూర్చితే వారి రోగాలు మటుమాయం అవుతాయని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చెట్టును దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఆ ప్రాంతంలో ఎన్నో అరుదైన మూలికలు ఉన్నాయనీ స్థానికులు చెబుతున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అరుదైన పక్షులు విహరిస్తూ అక్కడికి వచ్చే భక్తులను పలకరిస్తుంటాయి. పిల్లలకు ఆ చెట్టు పక్కనే సోమిడి గండి అనే కాల్వ ఉంటుంది. వర్షాకాలంలో ఆ సోమిడి గండి కాల్వ నీటి ప్రవాహంలో స్నానాలు ఆచరించి ఆ చింత చెట్టు నుంచి పిల్లలను ఐదు సార్లు అటు.. ఇటు పంపిస్తున్నారు. అలా పిల్లలను ఆ చింతచెట్టు మధ్యలో నుంచి పంపడం వల్ల వారి వ్యాధులు నయం అవుతాయని స్థానికుల విశ్వాసం..

బక్క చిక్కి పోయిన పిల్లలను అలా చెట్టు మధ్య నుంచి దాటించడం వల్ల వారు చాలా దృఢంగా తయారవుతున్నారని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.. ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని ఈ చెట్టును దర్శనం చేసుకొని వెళ్తున్నారు. రోగాలు నయం అయ్యాక చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మళ్ళీ ఒక్కసారి వచ్చి చింత చెట్టు నిలువు దోపిడి కానుకలు సమర్పించుకుంటారు. పక్కనే ఆలయం ఉండటంతో ఇది దేవుడు మహిమగా భవిస్తున్నారు.. లావు ఉన్న వ్యక్తులు చెట్టు మధ్యలో నుంచి వెళ్లడం కష్టం.. అయినా అతి కష్టం మీద.. చెట్టు మధ్యలో నుంచి వెళ్ళుతున్నారు.. ఈ విధంగా చెట్టు మధ్యలో నుంచి వెళ్తే… ఆరోగ్యంతో పాటు ఇతర విషయాల్లో మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు.

(టీవీ9 మూఢ నమ్మకాలను ప్రొత్సహించదు. ఆ ప్రాంతంలో జరిగే తంతును మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం)

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..