AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రతిభ వెలికి తీయాలి.. మంత్రి సబితా కీలక వ్యాఖ్యలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులను తక్కువగా వేసి చూడొద్దని అన్నారు. వాళ్లని ప్రోత్సహించి.. రత్నాల్లాంటి విద్యార్థులను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. అలా ప్రోత్సహించే గురువులను.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. మంగళవారం రోజున ఉపాధ్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Telangana: సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రతిభ వెలికి తీయాలి.. మంత్రి సబితా కీలక వ్యాఖ్యలు
Minister Sabitha Indra Reddy
Follow us
Aravind B

|

Updated on: Sep 06, 2023 | 10:54 AM

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులను తక్కువగా వేసి చూడొద్దని అన్నారు. వాళ్లని ప్రోత్సహించి.. రత్నాల్లాంటి విద్యార్థులను వెలికి తీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. అలా ప్రోత్సహించే గురువులను.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. మంగళవారం రోజున ఉపాధ్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత రవీంద్రభారతిలో నిర్వహించిన గురు పూజోత్సవంలో మంత్రి సబితా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది పేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని.. ప్రపంచంతో పోటీ పడేలా వారిని తీర్చిదిద్దాలని అన్నారు.

ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో చదువుకున్న 13 మంది ఎస్సీ అమ్మాయిలు బహుళజాతి పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించారని.. ఇది మనందరికీ కూడా గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. త్వరలోనే టీఆర్‌టీ ద్వారా 5,089 ఉపాధ్యాయ కొలువును భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు. నేను కూడా మా అమ్మమ్మ వాళ్ల ఊరిలో ఉండి చదువుకున్నానని.. ఆ ఊరికి మట్టి రోడ్డు ఉండేదని చెప్పారు. టీచర్ సైకిల్‌పై వచ్చి పీర్ల కొట్టంలో కూర్చోబెట్టి తమకు చదువు చెప్పేవారని తెలిపారు. ఇక సాయంత్రం అందరిని ఇళ్లల్లో వదిలేసి వెళ్లేవారని.. మంత్రి సబితా తన బాల్యా్న్ని గుర్తుకు చేసుకున్నారు. మరోవైపు.. దీపావళీ, క్రిస్మస్ , రంజాన్‌లాంటి పండగలను కొన్ని వర్గాలు, మతాలు మాత్రమే జరుపుకుంటారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. కానీ అన్ని వర్గాలు, అన్ని మతాల వారు జరుపుకునే పండుగ గురు పూజోత్సవని పేర్కొనన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా మంత్రులు సబితా, మహమూద్ అలీ.. మొత్తం 140 మందికి ఉత్తమ ఉపాధ్యాయులు,అధ్యాపకులు, ఆచార్యులకు ప్రశంస పత్రాలు అందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కూర రఘోత్తంరెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, సురభి వాణీదేవి సహా పలువురు ఉన్నతాధికారలు, నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాలు నిర్వహించారు. అయితే విద్యార్థులు టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులుగా ఒక్కరోజు విధులు నిర్వహిస్తారు. మరోవైపు ఇప్పిటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కొరత ఉంది. సరైన మౌళిక సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇలాంటి పాఠశాలల పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
నాగ చైతన్యతో అంత క్లోజ్‌గా కనిపిస్తోన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
పోలా అదిరిపోలా.. మల్లారెడ్డి మాస్ స్టెప్పులు..
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
నలుగురు ఐపీఎల్ డేంజరస్ ఓపెనర్లతో ఇంగ్లాండ్ పర్యటనకు భారత్
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
16 ఏళ్లల్లో ఒకే ఒక్క హిట్టు అందుకున్న హీరోయిన్.. చేసిన సినిమాలన్న
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
వంట గదే బ్యూటీ పార్లర్.. ఈ 8 ఐటెమ్స్ ఇచ్చే షాకింగ్ బెనిఫిట్స్ ఇవి
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
రామ్ చరణ్ విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడో తెలుసా?
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
ఇండియాలో 107 మంది పాకిస్తాన్‌ పౌరులు మిస్సింగ్‌!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!
తెల్ల నేరేడు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా!