Rain Alert:  ఇంకా వానలు వీడలేదు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

Rain Alert: ఇంకా వానలు వీడలేదు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్

Maqdood Husain Khaja

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 06, 2023 | 10:04 AM

ఒడిశా, ఉత్తరాంద్ర తీరాలకు ఆనుకుని బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం..తెలంగాణ మీదగా ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.. ఇప్పటికే తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చాలా చోట్ల వర్షాలు కురిపిస్తుంది. ఒడిశా, ఉత్తరాంద్ర తీరాలకు ఆనుకుని బంగాళా ఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ మీదగా ద్రోణి కొనసాగుతుంది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతోంది. దక్షిణ ఒడిశా, చత్తిస్ ఘడ్ మీదుగా ప్రయానించనుంది అల్పపీడనం.

– అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రుతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో కోస్తా, రాయలసీమ లో మోస్తారు వర్షాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు అలర్ట్ ప్రకటించింది. రాయలసీమలోని కర్నూలు, నంధ్యాల జిల్లాలకు అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 40-45 కిలోమీటర్ల వేగంతో ను.. గరిష్టంగా 55కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లోద్దని హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం.

Published on: Sep 06, 2023 10:03 AM