పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.. యువకుడి దుర్మరణం
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ఉరుములు మెరుపులతో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణంగా వర్షం పడుతున్న ప్పుడు చెట్లకింద తలదాచుకోవడం చేస్తుంటాం. అదే ఆ యువకుడిపాలిట శాపంగా మారింది. చెట్టుపై పిడుగుపడి యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గొలుగొండ మండలం జోగుంపేట లో పిడుగు పడి జయంత్ అనే యువకుడు ప్రణాలు కోల్పోయాడు.
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ఉరుములు మెరుపులతో పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణంగా వర్షం పడుతున్న ప్పుడు చెట్లకింద తలదాచుకోవడం చేస్తుంటాం. అదే ఆ యువకుడిపాలిట శాపంగా మారింది. చెట్టుపై పిడుగుపడి యువకుడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గొలుగొండ మండలం జోగుంపేట లో పిడుగు పడి జయంత్ అనే యువకుడు ప్రణాలు కోల్పోయాడు. పొలంలో నీరు కట్టేందుకు వెళ్లిన సూదివరపు జయంత్ పొలం పని పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఒక్కసారిగా వర్షం పెద్దదవడంతో అక్కడే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. చింత చెట్టు పైనే ఆ పిడుగు పడడంతో చెట్టు కింద ఉన్న జయంత్ ప్రాణాలు కోల్పోయాడు. అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ ధ్వంసం అయింది. పక్కనే ఉన్న మరో యువకుడు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న స్థానికులు నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తిరుమల శ్రీవారి సేవలో షారుఖ్‌ఖాన్, నయనతార
అక్కడ కరెంట్ బిల్లు కట్టడానికి జీతాలు కూడా సరిపోవడం లేదట
ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ రంగులో ఉల్కపాతం..
గోదారోళ్ల వినూత్న పెళ్లి.. అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి
సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన రతన్ టాటా.. మొదటి రెజ్యూమ్ చూస్తే అవాక్కే