అక్కడ కరెంట్ బిల్లు కట్టడానికి జీతాలు కూడా సరిపోవడం లేదట

అక్కడ కరెంట్ బిల్లు కట్టడానికి జీతాలు కూడా సరిపోవడం లేదట

Phani CH

|

Updated on: Sep 06, 2023 | 10:01 AM

పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఆగ్రహం కాస్తా ప్రజలను రోడ్డుపైకి వచ్చేలా చేసింది. విద్యుత్‌ బిల్లులు చెల్లించమని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెంచిన విద్యుత్‌ బిల్లులపై అనేక నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ బిల్లు చెల్లించడానికి తమ జీతాలు సరిపోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లాహోర్‌లో విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులపై దాడులు

పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఆగ్రహం కాస్తా ప్రజలను రోడ్డుపైకి వచ్చేలా చేసింది. విద్యుత్‌ బిల్లులు చెల్లించమని తెగేసి చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెంచిన విద్యుత్‌ బిల్లులపై అనేక నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ బిల్లు చెల్లించడానికి తమ జీతాలు సరిపోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. లాహోర్‌లో విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులపై దాడులు జరిగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిరుద్యోగం అధిక ద్రవ్యోల్బణంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేలాదిగా కరెంటు బిల్లులను తగులబెడుతున్నారు. తాజాగా ఫైసలాబాద్‌లో ఇద్దరు పిల్లల తండ్రికి 40వేల రూపాయల విద్యుత్‌ బిల్లు వచ్చే సరికి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ రంగులో ఉల్కపాతం..

గోదారోళ్ల వినూత్న పెళ్లి.. అమ్మాయిలు చీరకట్టులో బుల్లెట్ బైకులపై సందడి

సాధారణ ఉద్యోగిగా కెరీర్‌ ప్రారంభించిన రతన్‌ టాటా.. మొదటి రెజ్యూమ్‌ చూస్తే అవాక్కే

కారులో కొమ్ముల ఎద్దు.. ఎక్కడికెళ్తోంది ?? అసలు విషయం తెలిసి అవాక్కైన పోలీసులు !!

వాగులో చిక్కుకున్న రైతు.. క్షేమంగా బ‌య‌ట‌కు..