Krishna Mukunda Murari 6th September: ముకుంద ఆనందాన్ని ఆవిరి చేసిన భవానీ.. నీది బరితెగింపు తనమా.. సరదాకి కూడా వావి వరసలు మార్చవద్దు అంటూ వార్నింగ్

కృష్ణ ముకుంద మురారీ సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని టాప్ రేటింగ్ తో .దూసుకుపోతుంది.  ప్రేమ, పెళ్లి ఏది గొప్పది అనే కథతో సాగుతున్న ఈ సీరియల్ కుసుమ్ డోలా అనే సూపర్ హిట్ సీరియల్ ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ కి వెళ్లిన కృష్ణ, మురారీ, ముకుందలు ఒక రెస్టారెంట్ కి వెళ్తే.. అక్కడ కొందరు ముకుంద మురారీలు భార్యాభర్తలు అని పందెం వేస్తె.. ఆ గ్రూప్ లో ఒకే ఒక యువకుడు కృష్ణ మురారీ భార్య అని పందెం వేసి.. మొత్తం డబ్బులు గెలుస్తాడు. కృష్ణ తన గ్లామర్ పెంచుకోవాలని.. స్లిమ్ అవ్వాలని ఆలోచిస్తుంటే.. నేను మురారీ బెస్ట్ పెయిర్ అని సంతోష పడుతుంది ముకుంద. ఈ రోజు సెప్టెంబర్ 6వ తేదీన ఏమి జరుగుతుందో చూద్దాం.. 

Krishna Mukunda Murari 6th September: ముకుంద ఆనందాన్ని ఆవిరి చేసిన భవానీ..  నీది బరితెగింపు తనమా.. సరదాకి కూడా వావి వరసలు మార్చవద్దు అంటూ వార్నింగ్
Krishna Mukunda Murari
Follow us
Surya Kala

|

Updated on: Sep 06, 2023 | 9:42 AM

వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ కి వెళ్లిన కృష్ణ, మురారీ, ముకుందలు ఒక రెస్టారెంట్ కి వెళ్తే.. అక్కడ కొందరు ముకుంద మురారీలు భార్యాభర్తలు అని పందెం వేస్తె.. ఆ గ్రూప్ లో ఒకే ఒక యువకుడు కృష్ణ మురారీ భార్య అని పందెం వేసి.. మొత్తం డబ్బులు గెలుస్తాడు. కృష్ణ తన గ్లామర్ పెంచుకోవాలని.. స్లిమ్ అవ్వాలని ఆలోచిస్తుంటే.. నేను మురారీ బెస్ట్ పెయిర్ అని సంతోష పడుతుంది ముకుంద. ఈ రోజు సెప్టెంబర్ 6వ తేదీన ఏమి జరుగుతుందో చూద్దాం..

రేవతితో మధు మాట్లాడుతూ ఉంటాడు. ఆదర్శ్ వచ్చినా ముకుంద మనసు మారాలి.. లేదంటే ఏమి ప్రయోజనం అని అంటుంటే.. ప్రసాద్ సుమతి అలేఖ్యలు మాట్లాడుతూ ఉంటారు. కోటీశ్వరుడు ఆవాలనుకున్నా కానీ మా నాన్న ముందే సంపాదించాడు కదా అందుకే అప్పటి నుంచి నేను మా నాన్న సంపాదన ఖర్చు పెట్టేద్దామని నిర్ణయించుకున్నా అంటుంటే.. కృష్ణ, ముకుంద, మురారీలు వస్తారు. డల్ గా ఉన్న కృష్ణను చూసి ప్రసాద్ ఏమిటి కృష్ణ డల్ గా ఉన్నావు అని అడిగితే .. ముకుంద రెస్టారెంట్ లో ఫన్నీ విషయం జరిగింది చెబుతుంటే.. ముకుంద ఇప్పుడు అవన్నీ అవసరమా అని అంటుంటే.. సరదా విషయం అన్నావు కదా చెప్పెయ్యి అందరం నవ్వుకుందాం.. అంటుంటే..చెబుతున్నా.. అక్కడ ఉన్న కొందరు సరదా బెట్ కట్టి అందరూ నేనే మురారీ భార్య అని అనుకున్నరాట అది కూడా ఒకడే కృష్ణ మురారీ భార్య అని అంటే.. మిగిలిన 10మంది నేనే మురారీ భార్య అని బెట్ వేసాడట అని ఆనందంతో ముకుంద చెబుతుంది.. ముకుందా అని గట్టిగా అరుస్తుంది. దీనిని దిగజారడం అనాలో బరితెగింపు అనాలో నాకు అర్ధం కావడం లేదు అని రేవతి అనుకుంటుంటే.. అదే సమయంలో భవానీ మేడ మీద నుంచి దిగుతూ ..

ముకుందకు షాక్ ఇచ్చిన భవానీ..

ఏమి మాట్లాడుతున్నావు.. ఎవడో దారిన పోయేవాడు తప్పుడు కుట్రలు కూస్తే.. వాడి చెంప పగలగొట్టి.. కృష్ణను చూపించి ఇదిగో మురారీ భార్య కృష్ణ అని చెప్పాలి. ఈవిడే నా తోడికోడలు.. నేను మురారీ భార్యను కాదు తన ప్రాణ స్నేహితుడైన ఆదర్శ్ భార్యని అని తెలియజెప్పి ఉండాల్సింది. తెలియక వాళ్లు చేసిన పొరపాటున సరిద్ది అక్కడే మరచిపోవాలి.. అంతేకాని దానిని ఇంటి దాకా మోసుకుని రావడమే కాకుండా.. కృష్ణను అందరి ముందు అవమాన పరిచేలా మాట్లాడుతున్నావు.. నీకు సిగ్గుగా అనిపించడం లేదా.. అందరిలో అలా చెప్పుకోవడానికి నీ ఉద్దేశం ఏమిటి అసలు.. అందంగా ఉన్నానని మిడిసి పడుతున్నావా.. కృష్ణను ఎగతాళి చేస్తున్నావా అసలు ఏమిటి నీ ఉద్దేశ్యం.. వావి వరసలు లేవా అని అని ప్రశ్నిస్తుంది. రేవతి ఇప్పుడు బుద్ధి వస్తుంది దీనికి అనుకుంటుంది.

ఇవి కూడా చదవండి

భవానీని కూల్ చేయాలనుకుంటున్న కృష్ణ

ముకుంద ఏదో సరదా చెప్పింది కానీ ఇందులో తన తప్పేమీ లేదు పెద్దత్తయ్య అని ముకుంద వైపు మాట్లాడుతుంది కృష్ణ. మురారీ భార్యగా ముకుంద ఫీల్ అవ్వలేదు.. సరదాగా రెస్టారెంట్ లో వాళ్లు ఎవరో అనుకున్నారని చెబుతుంది అంతే అంటుంటే.. భవానీ కోపంగా నోరు ముయ్యి కృష్ణ నువ్వు.. తనని వెనకేసుకొస్తున్నావా లేదా తప్పుఒప్పులు నేర్పిస్తున్నావా అని అంటే.. నా ఉద్దేశ్యం అది కాదు పెద్దత్తయ్య అని అంటుంది కృష్ణ. నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్లే సమాధానం చెప్పాలి అంటుంది భవానీ.. ముకుంద నువ్వు మాట్లాడిన దానిలో ఎంత తప్పు ఉందొ ఇప్పటికైనా నీకు అర్ధం అయిందా అలా మాట్లాడడం తప్పా..కదా అని భవానీ ముకుందని ప్రశ్నిస్తుంది. నోరు తెరిచి సమాధానం చెప్పు ముకుంద అని అంటే తప్పే అత్తయ్య అని అంటుంది.. నీ భర్త ఎవరు అని ముకుందని భవానీ ప్రశ్నిస్తే.. ముకుంద మురారీ వైపు చూసి ఆదర్శ్ అని చెపితే మురారీ నీకు ఏమవుతాడు.. అని అడిగితే నా భర్త ప్రాణ స్నేహితుడు అని ముకుంద అంటే.. ఇది ఎప్పటికీ నీకు గుర్తుంటుందా అని అంటే.. ముకుంద సైలెంట్ గా ఉంటే.. నేను ఇందాకే చెప్పగా ముకుంద నాకు సైగలు వద్దు సమాధానం చెప్పు అంటుంది..  గుర్తుంటుందని చెబుతుంది ముకుంద.  ముకుందకే కాదు అందరికీ చెబుతున్నా, మన సరదాల హెల్దీగా ఉండాలని చెబుతుంది భవానీ..

గ్లామర్ పెంచుకోవడానికి కృష్ణ తిప్పలు

తాను అందంగా లేనని భావించిన కృష్ణ, గ్లామర్ పెంచుకోవడానికి టిప్స్ మొదలు పెడుతుంది. రకరకాల జ్యుస్ లు తెచ్చుకుని తాగడం మొదలు పెడుతుంది.  నువ్వు క్లిక్ ముందు ఏమైనా జ్యుస్ షాప్ పెడుతున్నావా అని మురారీ సరదాగా కామెంట్ చేస్తాడు. అంతేకాదు కృష్ణ తన అందంగా లేను అనుకుని బాధపడుతూ ఉంటుంది.. అనుకున్న మురారీ.. కృష్ణ నువ్వు ఎలా ఉంటే అలాగే నాకు ఇష్టం.. నీ తింగరి తనం నాకు నచ్చుతుంది అని అంటే.. అవును.. నేను ఒక్క ఏసీపీ సార్ కు నచ్చితే చాలు.. అందరికీ నచ్చాల్సిన పని లేదు అని కృష్ణ తనకు తానే నచ్చ చెప్పుకుంటుంది.

తన ప్రేమను భవానీకి చెప్పకపోతే సచ్చిపోతానని ముకుంద వార్నింగ్

ముకుంద తనను భవానీ తిట్టడంతో రగిలిపోతుంది. ఎలాగైనా తన ప్రేమను భవానికి చెప్పాలని భావించి తండ్రి శ్రీనివాస్ దగ్గరకు వెళ్తుంది. కృష్ణ కోసం అలోచించి మీరు మురారీ తన ప్రేమ ప్రేమల గురించి భవానికి చెప్పకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రిని హెచ్చరిస్తుంది. ఆలోచించుకోండి కూతురు కావాలో నిజం కావాలో అని చెబుతుంది.. తనకు మురారీకావాలని.. తన ప్రేమ బతకాలని తాను కృష్ణ చేతిలో ఓడిపోకూడదంటే తండ్రి నిజం చెప్పాలని కోరుతుంది. అంతేకాదు తాను కృష్ణ భర్తని ప్రేమించలేదని.. తాను ప్రేమించిన వాడినే కృష్ణ పెళ్లి చేసుకుంది కనుక నా మురారీ నాకు దక్కాలి.. లేదంటే ప్రాణాలను తీసుకుంటానని చెబుతుంది. దీంతో శ్రీనివాస్ కూతురిని అనునయిస్తూ. భవానీతో మీ ప్రేమ గురించి మాట్లాడతానని ముకుందతో చెబుతాడు.

రేపటి ఎపిసోడ్ లో

వ‌ర‌ల‌క్ష్మి వ్ర‌తం చేయించిన పూజారీ వ్రతం పూర్తి అయింది.. భర్త ఆశీర్వాదం తీసుకోమని అందరికి చెబుతాడు. అప్పుడు ముకుంద  త‌ర్వాత భ‌ర్త ఆశీర్వాదం తీసుకోమ‌ని పూజారి చెబుతాడువరలక్ష్మి వ్రతం తర్వాత మురారీ ఆశీర్వాదం తీసుకున్న ముకుంద ని రేవ‌తి, కృష్ణ కూడా చూస్తారు ..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?