Bigg Boss Telugu 7: బాబోయ్ శోభాశెట్టి.. ఇదేం యాటిట్యూడ్.. ఇదేం ఓవరాక్షన్.. పాపం గౌతమ్
జనాల్ని సుద్దులు చెప్పడం.. తాను మాత్రం ఫాలో అవ్వకపోవడం ఇప్పుడు కల్చర్. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ శోభా శెట్టి అందుకు పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు వీక్షకులు. అరె ఫస్ట్ వీక్ కదా.. నామినేషన్‌ను లైట్ తీస్కోమని పల్లవి ప్రశాంత్‌కి చెప్పి.. ఆ తర్వాత తనను నామినేట్ చేసినవాళ్లపై విరుచుకుపడింది ఆమె. అంతేకాదు ఆమె మాటతీరు, ప్రవర్తనలో కూడా యాటిట్యూడ్ కనిపిస్తుంది. మొత్తంగా అమ్మడిని మీమ్స్‌లో వాయించేస్తున్నారు కంటెంట్ క్రియేటర్స్.
బిగ్ బాస్ సీజన్ 7 పక్కాగానే ప్లాన్ చేశారు నిర్వాహకులు. రెండు రోజుల్లోనే గొడవలు స్టార్టయిపోయాయి. నామినేషన్స్ సందర్భంగా పలువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కానీ జనాలు ఎంత ఇస్మార్ట్ ఉన్నారంటే.. కంటెస్టెంట్స్ ఎవరు ఎలాంటివారు అన్న విషయం పై ఇప్పుటికే ఓ అవగాహనకు వచ్చారు. అన్నం ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందో, లేదో తెలుస్తుంది అన్నట్లు.. అందరి గురించి ఓ ఐడియా అయితే వచ్చింది. ఎందుకే ఏదైనా అంటే ఇబ్బంది పడతారు, ఫస్ట్‌లోనే నామినేట్ చేస్తారు అన్నట్లు హీరో శివాజీ చాలా విషయాల్లో మౌనం వహిస్తున్నారు. కొన్ని అదిరే పంచ్‌లు వేసి కూడా మళ్లీ వాటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహారణకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఇంట్లోకి ఓ మొక్కతో ఎంట్రీ ఇస్తాడు. లోపల ఇది ఎక్కడ పెడతాడు అని టేస్టీ తేజా అడిగితే.. వెళ్లేటప్పుడు తీసుకెళ్తాడు.. అదే కప్పుతో అని శివాజీ కవర్ చేయడం కనిపించింది. ఇలా రెండు, సందర్బాల్లో ఆయన పంచ్‌లు వేసి.. ఎందుకులే బూమరాంగ్ అవుతాయని ఆయన వెనక్కి తగ్గడం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఏదైనా ట్రిగ్గర్ అయ్యే పాయింట్ వస్తే మాత్రం శివాజీ నుంచి మస్త కంటెంట్ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఆ శోభాశెట్టి.. ఓవరాక్షన్ అయితే జనాలు తట్టుకోలేని పరిస్థితి. ఎక్కువమంది నామినేట్ చేశారని ఆమెను తక్కువ చేయడం లేదు. ఫస్ట్ వారాల్లో ఎక్కువమంది ఒక్కర్నే నామినేట్ చేస్తే.. వారిపై నిజానికి సింపతీ పెరుగుతుంది. బిగ్ బాస్ 4 మీరు చూసి ఉంటే.. కుమార్ సాయి ఏ తప్పు చేయకపోయినా అతడిని అందరూ నామినేట్ చేయడంతో.. ఆడియెన్స్ అతడిపై సింపతీ చూపించి.. ఓట్లు గుద్దేశారు. అయితే ఇక్కడ డిఫరెంట్. శోభా శెట్టి.. బిహేవియర్‌లో తప్పు కనిపిస్తుంది. దామిని శోభాను నామినేట్ చేసింది.. తను వివరణ ఇస్తుంటే వినాలి కదా…? అబ్బే సిల్లీ నామినేషన్ అంటూ మీద పడిపోయింది. పాపం గౌతమ్ విషయంలో అయితే టూ మచ్. అతడు నిజంగానే రెస్పెక్ట్ ఇచ్చి శోభా గారు, మేడమ్ అంటే.. సర్కాస్టిక్‌గా అలా పిలుస్తున్నావంటూ ఒంటి కాలుపై లేచిపోతుంది. అతడు కూల్‌గా సమాధానం ఇస్తున్నా.. ఈవిడ అరుస్తూనే ఉంది. గౌతమ్ లాజిక్‌గా పాయింట్ మాట్లాడుతుంటే.. శోభా గొంతు వేసుకుని మీద పడిపోతుంది. ఆపై ఏడుపు. కేవలం సీరియల్ బ్యాచ్‌తో తప్ప.. ఆమె ఎవరితో మంచిగా ఉన్న దాఖలాలు లేవు. ముందుగా ఆమె బిహేవియర్‌లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్లు అనిపిస్తుంది.
View this post on Instagram
యాటిట్యూడ్‌తో పోయినసారి గీతూ రాయల్ ఎక్కువకాలం నెట్టుకొచ్చింది. సో.. ఆ గేమ్ ప్లాన్‌తో వెళ్తే.. కొంతకాలం నెగ్గుకురావడానికి ఈ దారిని ఎంచుకుందో లేదా నిజంగానే తన బిహేవియర్ అలానో కొద్ది రోజుల్లో గడిస్తే కానీ తెలీదు. ఇక ప్రిన్స్ యావర్ సైతం.. షకీలా గారిని నామినేట్ చేసిన విధానం ఫన్నీగా అనిపించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..