Bigg Boss 7 Telugu: ఓటింగ్లో దూసుకుపోతున్న ఆ ఒక్కడు.. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమె కానుందా ?..
ఇప్పుడిప్పుడే మొదలైన ఈ షోలో మొదటి నామినేషన్స్ మాత్రం హీటెక్కాయి. ఇక కొందరు సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేయగా.. మరికొందరు కాస్త బెటర్ గానే రీజన్స్ చెప్పారు. మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. అందులో 1. రతిక, 2. ప్రిన్స్ యవర్, 3. శోభా శెట్టి, 4.పల్లవి ప్రశాంత్, 5. కిరణ్ రాథోడ్, 6. షకీలా, 7. గౌతమ కృష్ణ, 8. సింగర్ దామిని నామినేషన్స్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్ సీజన్ 7 ప్రారంభమై అప్పుడే నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయింది. షో మొదలై వారం కూడా కాలేదు అప్పుడే నామినేషన్స్ అంటూ కంటెస్టెంట్స్ మధ్య మంటపెట్టేశాడు బిగ్బాస్. ఇంకా ఒకరికి ఒకరు పూర్తిగా తెలుసుకోకుండానే తమ తోటి కంటెస్టెంట్స్ పై కంప్లైంట్స్ ఇవ్వాలని.. నామినేట్ చేయాల్సిందే అంటూ ఆర్డర్ వేశాడు. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ షోలో మొదటి నామినేషన్స్ మాత్రం హీటెక్కాయి. ఇక కొందరు సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేయగా.. మరికొందరు కాస్త బెటర్ గానే రీజన్స్ చెప్పారు. మొత్తానికి ఫస్ట్ వీక్ హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. అందులో 1. రతిక, 2. ప్రిన్స్ యవర్, 3. శోభా శెట్టి, 4.పల్లవి ప్రశాంత్, 5. కిరణ్ రాథోడ్, 6. షకీలా, 7. గౌతమ కృష్ణ, 8. సింగర్ దామిని నామినేషన్స్ లిస్ట్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇక సెప్టెంబర్ 5 రాత్రి నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అయితే ప్రతి సీజన్ మాదిరిగా కాకుండా.. ఈసారి ఓటింగ్ వేసే విధానాన్ని కూడా మార్చేశారు. హాట్ స్టార్ లో అందరికి కాకుండా కేవలం ఒక్కరికి మాత్రమే ఓటు వేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి రైతు బిడ్డగా ఇంట్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కు ఓటింగ్ పెరిగింది. ఎవరూ ఊహించని రీతిలో ప్రశాంత్ ఎక్కువ ఓట్లు అందుకుంటూ ముందు స్థానంలో దూసుకుపోతున్నాడు. ఇక అతని తర్వాత స్థానంలో యంగ్ హీరో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ప్రశాంత్ తర్వాత ఎక్కువగా ఓట్లు వచ్చింది మాత్రం గౌతమ్ కు మాత్రమే. గత ఎపిసోడ్ లో శోభా శెట్టితో జరిగిన గొడవతో గౌతమ్ పై పాజిటివిటి వచ్చినట్లే తెలుస్తోంది.
View this post on Instagram
ఆ తర్వాత హీరోయిన్ రతిక మూడో స్థానంలో ఉండగా.. షకిలా, దామిని, ప్రిన్స్ యవర్, శోభా శెట్టికి అంతంత మాత్రంగానే ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా అందరి కంటే ఆఖరి స్థానంలో ఉంది కిరణ్ రాథోడ్. అయితే ఇప్పుడిప్పుడే టాస్కులు అంటూ కంటెస్టెంట్లకు ఆడించేందుకు సిద్ధమయ్యాడు బిగ్బాస్ . ఓటింగ్ క్లోజ్ కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉంది. ఈ మూడు రోజులలో కంటెస్టెంట్స్ ఆట తీరు.. ప్రవర్తన బట్టి ఈ ఓటింగ్ రేంజ్ మారే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉంది మాత్రం కిరణ్ రాథోడ్. అందరికంటే తక్కువ ఓటింగ్ ఇప్పటివరకు ఆమెకు మాత్రమే వచ్చింది. కిరణ్ రాథోడ్ ప్రేక్షకులకు అంతగా తెలియని పేరు. ఇకపోతే ఆమెకు తెలుగు రాకపోవడం ఆమెకు మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ కిరణ్ కాకపోతే.. షకీలా, ప్రిన్స్ యవర్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.