Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: ఏదీ మిస్ కావొద్దు.. అరచేతిలో జీ-20 సమావేశాలు.. మినిట్ టు మినిట్ అప్డేట్స్‌ను ఇలా తెలుసుకోండి..

G-20 Summit Updates: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. G20-2023 సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ ప్రభుత్వం.. దీనిని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. ఈ సదస్సుకు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌తో సహా పలు దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది.

G20 Summit: ఏదీ మిస్ కావొద్దు.. అరచేతిలో జీ-20 సమావేశాలు.. మినిట్ టు మినిట్ అప్డేట్స్‌ను ఇలా తెలుసుకోండి..
G20 Summit 2023
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 06, 2023 | 11:15 AM

G-20 Summit Updates: జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. G20-2023 సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ ప్రభుత్వం.. దీనిని విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేసింది. ఈ సదస్సుకు అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్‌తో సహా పలు దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా సిద్ధమైంది. G20 సమ్మిట్ సెప్టెంబర్ 9, 10 తేదీలలో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరగనుంది. దీనిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అయితే, జీ20 సమావేశాలకు సంబంధించిన ప్రతి క్షణం అప్‌డేట్‌ను ఇంట్లో కూర్చునే తెలుసుకోవచ్చు.. ఎప్పుడు ఏం ఏం జరుగుతుంది.. ఎవరెవరు పాల్గొంటున్నారు.. ఎలాంటి అంశాలపై చర్చిస్తారు.. దేశాధినేతల ప్రత్యేక సమావేశాలు.. ఇలా G20 అన్ని అప్‌డేట్‌లను తెలుసుకోవాలంటే.. దీని కోసం మీరు కొన్ని ముఖ్యమైన ప్లాట్‌ఫారమ్‌ల గురించి ముందుగా తెలుసుకోవాలి.

ప్రజల సమాచారం కోసం.. మొత్తం 5 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. వీటి సహాయంతో మీరు ఇంట్లో కూర్చుని.. G20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ప్రతి క్షణం అధికారిక సమాచారాన్ని పొందగలవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఏమిటి, వాటన్నింటికి సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకోండి..

అంతేకాకుండా TV9 Telugu తో కనెక్ట్ అయి ఉండండి. మీరు G20 సమ్మిట్ గురించి సవివరమైన సమాచారాన్ని ప్రతిక్షణం పొందుతూనే ఉండవచ్చు. ఇది మాత్రమే కాదు, ప్రతి క్షణం సమాచారం కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు.. G20కి సంబంధించిన వార్తల గురించి చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

G20 శిఖరాగ్ర సదస్సు 2023 కు సంబంధించిన ఈ 5 అధికారిక ప్లాట్‌ఫారమ్‌లు ఏంటో ఈ కింద తెలుసుకోండి..

  1. జి20 సదస్సుకు సంబంధించిన ప్రతి వివరాలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కొన్ని అధికారిక వేదికలను కూడా సిద్ధం చేసింది. G20 అధికారిక సైట్ https://www.g20.org/en/ ని సందర్శించడం ద్వారా మీరు G20 సమ్మిట్‌కు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు..
  2. అధికారిక వెబ్‌సైట్ కాకుండా, Facebook లో కూడా మీకు సమాచారం కావాలంటే.. దీని కోసం మీరు G20 India https://www.facebook.com/g20org అధికారిక పేజీకి వెళ్లాలి.
  3. అదే సమయంలో మీరు X (Twitter)లో G20కి సంబంధించిన అధికారిక సమాచారం కావాలంటే, దీని కోసం మీరు G20 India (@g20org) అధికారిక X పేజీకి వెళ్లాలి.. https://twitter.com/g20org.
  4. G20కి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వం Facebook, X (Twitter) లలో మాత్రమే కాకుండా Instagram, YouTubeలో కూడా అధికారిక పేజీలను రూపొందించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, Instagramలోని ఖాతా Facebook ద్వారా హ్యాండిల్ చేయవచ్చు..
  5. YouTubeలో అధికారిక ఖాతా పేరు G20 India, ఈ ప్లాట్‌ఫారమ్‌లో మీరు G20కి సంబంధించిన తాజా అప్‌డేట్‌లను వీడియోల రూపంలో పొందుతూనే ఉండవచ్చు. G20 అధికారిక YouTube ఖాతా కోసం https://www.youtube.com/@g20orgindiaని సందర్శించండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..