Health Care: 30 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులకు అలర్ట్.. త్వరగా ఆ సమస్య బారిన పడకూడదంటే ఇలా చేయండి..

Health Tips For Men and Women: ఉరుకులు పరుగుల జీవితం.. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇలా ప్రతి చిన్న విషయం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఆహారంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. యవ్వనంలో శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి..

Health Care: 30 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులకు అలర్ట్.. త్వరగా ఆ సమస్య బారిన పడకూడదంటే ఇలా చేయండి..
Health Care Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 04, 2023 | 4:19 PM

Health Tips For Men and Women: ఉరుకులు పరుగుల జీవితం.. చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం.. ఇలా ప్రతి చిన్న విషయం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఆహారంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. యవ్వనంలో శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు మొదలవుతాయి.. సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే, అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి ఒత్తిడి, ఆహారం, వ్యాయామం, తగినంత నిద్రపై పూర్తిగా శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు ఎల్లప్పుడూ సలహా ఇస్తున్నారు. 30 సంవత్సరాల వయస్సులో మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా చూసుకుంటారు అనేది రాబోయే 10 నుంచి 12 సంవత్సరాలు మీకు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. అందుకే.. ఈ వయసులో మీ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి.. అకాల వృద్ధాప్యాన్ని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫైబర్ ఆహారాలు తీసుకోండి..

మీ ఆహారంలో ఫైబర్ చేర్చడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు కనీసం 30 గ్రాముల ఫైబర్ శరీరానికి అందాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందువల్ల మీ ఆహారంలో ఖచ్చితంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోండి..

శరీరానికి ఒమేగా -3 కూడా ముఖ్యమైనది..

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో మంటను తగ్గిస్తుంది. అలాగే జీవితకాలాన్ని పెంచడంలో అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఆహారంలో సాల్మన్ లేదా సార్డిన్ చేపలను చేర్చుకోండి. అంతేకాకుండా గింజలు, చియా విత్తనాలను కూడా తినవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎముకల బలం కోసం కాల్షియం

శరీరంలోని ఎముకల సంరక్షణ కూడా ముఖ్యం. 30 ఏళ్ల తర్వాత, ఎముకలు కొద్దిగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. ఈ వయస్సులో, పాలు, పెరుగు, చీజ్, బ్రోకలీ, బచ్చలికూర, పాలకూర, బాదం వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తినాలి.

రెగ్యూలర్‌గా ప్రోటీన్ ఆహారం తీసుకోండి

కండరాల పెరుగుదలకు ప్రోటీన్ కూడా అవసరం. 30 ఏళ్ల తర్వాత శరీరానికి ఇది చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పురుషులు కనీసం 55 గ్రాములు, స్త్రీలు 45 గ్రాముల ప్రొటీన్లను రోజూ తినాలని సూచిస్తున్నారు. మీ ఆహారంలో గుడ్లు, పాలు, పప్పులు, చిక్కుళ్ళు, సోయాబీన్స్ వంటి వాటిని రెగ్యూలర్‌గా చేర్చుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!