India vs Bharat Row: ఇండియా.. భారత్‌గా మారుతోందా..? అదంతా పుకార్లేనా.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఏమన్నారో తెలుసా..
India or Bharat: ఇండియా.. భారత్‌గా మారుతోంది.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కీలక బిల్లుకు సిద్ధమైంది.. ఇక మనదేశం పేరు భారత్.. అంటూ చర్చ జరుగుతోంది. ఇండియా పేరును 'భారత్'గా మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తుందన్న ఊహాగానాల మధ్య కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. ఇవి కేవలం “పుకార్లు” అంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.

India or Bharat: ఇండియా.. భారత్‌గా మారుతోంది.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కీలక బిల్లుకు సిద్ధమైంది.. ఇక మనదేశం పేరు భారత్.. అంటూ చర్చ జరుగుతోంది. ఇండియా పేరును ‘భారత్’గా మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తుందన్న ఊహాగానాల మధ్య కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక ప్రకటన చేశారు. ఇవి కేవలం “పుకార్లు” అంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. G20 విందు ఆహ్వానం కరపత్రం తర్వాత భారతదేశంలో రాజకీయ రచ్చ మొదలైంది. సాధారణ ‘ప్రెసిండెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ పేరుతో ముద్రించారు. దీంతో పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి ముందు దేశం పేరు మార్పు కార్డులపై వివాదం మొదలైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఎ) ని ఓడించాలనే లక్ష్యంతో.. విపక్షాలన్నీ ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి పేరు ఇండియా అని ఉండటంతోనే.. ప్రభుత్వం పేరు మారుస్తుందంటూ విపక్షాల కూటమికి సంబంధించిన నేతలు ఎదరుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన ప్రభుత్వ బుక్‌లెట్ 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ లో మోడీ పేరును ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా పేర్కొన్నారు.
ఆరోపణలు, అధికార-విపక్ష పార్టీల వాదనల మధ్య.. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సంస్థ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో మాట్లాడుతూ.. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని, అయితే ఇది ‘భారత్’ అనే పేరు పట్ల.. వారు ‘భారత్’కి ఎలా వ్యతిరేకంగా ఉన్నారనే దానిపై వారి మనస్తత్వాన్ని స్పష్టంగా చూపిస్తుంది అని పేర్కొన్నారు. “ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని నేను భావిస్తున్నాను. ఏవేవో పుకార్లు జరుగుతున్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. భారత్ అనే పదాన్ని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి మనస్తత్వం స్పష్టంగా కనిపిస్తుంది” అని అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు.
G20 డిన్నర్ ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ గురించి ప్రస్తావిస్తూ అనురాగ్ ఠాకూర్ ఇలా అన్నారు.. “భారత రాష్ట్రపతి కావున.. అందుకే అలా రాశారు.. భారత్ ప్రెసిడెంట్.. అయితే ఏంటి? ఇది పెద్ద విషయం కాదు. ఇంతకు ముందు కూడా భారత్ సర్కార్ పేరుతో పలు ఆహ్వానాలు పంపడం మీరు చూశారు.. దీనిపై ఇంకా సమస్య ఎక్కడ ఉంది..?” అంటూ పేర్కొన్నారు.
“నేను భారత్ సర్కార్ మంత్రిని, చాలా న్యూస్ ఛానల్స్ వారి పేరు మీద భారత్ కూడా ఉన్నాయి. భారత్ అనే పేరుంటే ఎలర్జీ ఎందుకు.. వీళ్ళెవరికైనా భారత్ అంటే ఎందుకు అభ్యంతరం. భారత్ పేరును ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు భరత్ ప్రస్తావన వచ్చినప్పుడు మీకు కూడా బాధ అనిపించిందా? దేశం ముందు పార్టీ పెట్టి రాజకీయాల ఊబిలో కూరుకుపోయిన వాళ్లే.. విదేశీ గడ్డపై కూడా దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు’’ అని అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..