Processed Meat: ప్రాసెస్ చేసిన మాంసంలో హానికర బాక్టీరియా..! ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..
ఉరుకులు పరుగుల జీవితం.. అనేక సమస్యలతో చాలామంది అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వాటిలో ప్రాసెస్సెడ్ మీట్ ఒకటి.. ఆధునిక కాలంలో ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన మాంసం వినియోగం బాగా పెరిగింది. ఇందులో అధిక మొత్తంలో కొవ్వు, సోడియం ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
ఉరుకులు పరుగుల జీవితం.. అనేక సమస్యలతో చాలామంది అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి వాటిలో ప్రాసెస్సెడ్ మీట్ ఒకటి.. ఆధునిక కాలంలో ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన మాంసం వినియోగం బాగా పెరిగింది. ఇందులో అధిక మొత్తంలో కొవ్వు, సోడియం ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీంతోపాటు ఈ రకమైన మాంసంలో యాసిడ్ బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా శరీరానికి హాని చేస్తుందా..? లేదా..? అనే అనుమానాలు తరచూ తలెత్తుంటాయి. అయితే.. ఇది హాని చేస్తుందా..? లేదా అనే విషయాలను తెలుసుకుందాం..
లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటే ఏమిటి..?
లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా ప్రాసెస్ చేసిన మాంసాలతో పాటు ఊరగాయలు, పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలలో కనుగొంటారు. లాక్టోబాసిల్లస్ సేక్, లాక్టోబాసిల్లస్ కర్వేటస్, ల్యూకోనోస్టాక్ జెలిడియం, ల్యూకోనోస్టాక్ కార్నోసమ్, ల్యూకోనోస్టోక్ మెలంటెరాయిడ్స్ (ల్యూకోనోస్టోక్, సెరినోకోలోస్టరాయిడ్స్, సెరినోకోసిలోకోస్టరోయిడ్స్, అసినెక్కోసిలోకోస్టరాయిడ్స్), కోకస్ లాంటివి కనిపిస్తాయి.
లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా ప్రతికూలతలు..
సాధారణంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాను తినడం సురక్షితంగా పరిగణిస్తారు. కానీ మీరు దానిని అధికంగా తీసుకుంటే, మీరు కొంత నష్టాన్ని భరించవలసి ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..
మీకు ఇప్పటికే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్య ఉంటే, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. ప్రోబయోటిక్ ఫుడ్స్ తినే 38 మందిపై ఒక అధ్యయనం జరిగింది. వీరిలో చాలా మంది రక్తంలో లాక్టిక్ యాసిడ్ పెరిగింది. చిన్న ప్రేగులలో ఎక్కువ బ్యాక్టీరియా పెరగడం, మెదడు పొగమంచు (బ్రెయిన్ ఫాగ్), ఉబ్బరం, గ్యాస్ వంటి లక్షణాలు కొందరిలో కనిపించడం ప్రారంభించాయి.
ప్రోబయోటిక్స్ మన రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయని కొందరు పరిశోధకులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ, ప్రోబయోటిక్ సప్లిమెంట్లను ఉపయోగించే వారికి హాని ఎక్కువగా ఉంటుందంటున్నారు. నివేదికల ప్రకారం.. ప్రతి ఒక్కరి వైద్య పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కావున ఏదైనా తినే ముందు, డైటీషియన్ సలహా తీసుకోవడం ఉత్తమం.
వాస్తవానికి అనుకూలమైన ఆహారంలో ప్యాక్ చేసిన.. లేదా ప్రాసెస్ చేసిన ఆహారం ఉంటుంది. ఈ రెడీమేడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో రసాయనాలు, పలు రకాల మిశ్రమాలను కలుపుతారు. అందుకే.. వీటిని తినడం అంత మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.