Health Tips: కాలేయం ఆరోగ్యం కోసం తినాల్సిన, తినకూడని ఆహారాలివే.. ఇలా చేస్తే ఫ్యాటీ లివర్ దూరం..

Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానవ శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కాలేయం పని చేస్తుంది. ఈ క్రమంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నవారు, లేదా ఈ సమస్యకు దూరంగా ఉండాలన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి ఫ్యాటీ లివర్ నివారణ కోసం, నిరోధన కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. 

Health Tips: కాలేయం ఆరోగ్యం కోసం తినాల్సిన, తినకూడని ఆహారాలివే.. ఇలా చేస్తే ఫ్యాటీ లివర్ దూరం..
Fatty Liver
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 04, 2023 | 10:00 AM

Health Tips: ప్రస్తుత కాలంలో ఏది తినాలన్నా ఆహారానికి పెను ముప్పుగానే మారింది. సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు, తినకూడని పదార్థాలను తినడం వల్ల అనేక మందిలో డయాబెటీస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు సర్వసాధారణంగా ఉన్నాయి. డయాబెటీస్ కంటే ఫ్యాటీ లివర్ సమస్యతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానవ శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కాలేయం పని చేస్తుంది. ఈ క్రమంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నవారు, లేదా ఈ సమస్యకు దూరంగా ఉండాలన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి ఫ్యాటీ లివర్ నివారణ కోసం, నిరోధన కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు తినాల్సిన ఆహారాలు..

వెల్లుల్లి: ఫ్యాటీ లివర్‌పై చేసిన ఆనేక పరిశోధనల ప్రకారం ఈ సమస్యతో బాధపడుతున్న వారు సమస్య నుంచి బయట పడడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడగల అనేక పోషకాలు ఉన్నాయి.

గ్రీన్ టీ: యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగిన గ్రీన్ టీ ఫ్యాటీ లివర్‌కి చెక్ పెట్టడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇంకా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్‌ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇవి కూడా చదవండి

అవకాడో: ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నవారికి అవకాడో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్‌ని తగ్గించి కాలేయాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు బరువు తగ్గేవారికి ఉపకరిస్తుంది.

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు తినకూడని ఆహారాలు..

ప్రాసెస్డ్ ఫుడ్: ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నవారు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.

షుగర్ ఫుడ్స్: షుగర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. చక్కెర పెరిగినప్పుడు  కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య మరితం తీవ్రతరం అవుతుంది. ఈ కారణంగా చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ వంటి షుగర్ ఎక్కువగా ఉంటే పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది.

గమనిక: పై ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి కోసం ఇచ్చినది మాత్రమే. ఏమైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.