Health Tips: కలర్‌ఫుల్ క్యాప్సికమ్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. తినకుంటే అన్నీ మిస్ అయినట్లే..
Capsicum Benefits: ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల్లోని క్యాప్సికమ్‌ని మీరు చూసే ఉంటారు. తినడానికి ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు ఆకర్షణీయమైన చర్మం, మెరుగైన కంటిచూపును అందిస్తుంది. ఇంతకీ ఈ క్యాప్సికమ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 02, 2023 | 9:52 AM

1. కంటి ఆరోగ్యం: క్యాప్సికమ్‌లోని లుటిన్, జియాక్సంతిన్ కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా క్యాప్సికమ్‌ని తినడం వల్ల కంటి శుక్లం, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటిశుక్లం, మాక్యులార్ డీజెనరేషన్ వంటి దృష్టి లోపాల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

2. బరువు తగ్గడం: రెడ్ క్యాప్సికమ్స్‌లోని పోషకాలు థర్మోజెనిసిస్‌ని సక్రియం చేయడం, జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి. అంతేకాక హృదయ స్పందన రేటు, రక్తపోటు క్రమబద్ధీకరించడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలను నిరోధిస్తుంది.

3. రక్తహీనతకు చెక్: క్యాప్సికమ్‌లో ఐరన్, విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తహీనత సమస్యకు చెక్ పెడతాయి. ఈ కారణంగానే రక్తం లేనివారు క్యాప్సికమ్‌ని తినాలని చెబుతుంటారు.

4. క్యాన్సర్ దూరం: యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా క్యాప్సికమ్ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. ఇంకా క్యాన్సర్ కణాలను విచ్చిన్నం చేసి, భవిష్యత్తులో ఈ సమస్య ఎదురుకాకుండా చేస్తాయి.

5. చర్మ సంరక్షణ: క్యాప్సికమ్‌లోని క్యాప్సైసిన్ చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇంకా ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, చర్మ సమస్యలను దూరం చేస్తాయి.





























