- Telugu News Photo Gallery Technology photos Sony launches new smart phone sony xperia 5 v features and price details
Sony Xperia 5 V: సోనీ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్.. మునుపెన్నడూ చూడని స్టన్నింగ్ ఫీచర్స్
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సోనీ. ప్రీమియం గ్యాడ్జెట్స్‌కు పెట్టింది పేరైన ఈ కంపెనీ తాజాగా మార్కెట్లోకి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. సోనీ ఎక్స్‌పీరియా 5వీ పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వరల్డ్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారత్‌లోకి రానుంది. ఇంతకీ సోనీ ఎక్స్‌పీరియా 5వీలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటి.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 02, 2023 | 9:20 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. సోనీ ఎక్స్‌పీరియా 5వీ పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే ఒకే ఒక వేరియంట్‌లో లాంచ్ చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను అందించారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే మన ఇండియన్ కరెన్సీలో రూ. 89 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ హెచ్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 52 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 12 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

సోనీ ఎక్స్‌పీరియా 5వీ స్మార్ట్ ఫోన్‌లో 30 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఏంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు.





























