- Telugu News Photo Gallery Technology photos According to reports Instagram planning to increase reels time to 10 minutes
Instagram: మీరు ఇన్‌స్టాలో రీల్స్ చేస్తారా.? మీకోసమే ఈ గుడ్ న్యూస్..
యూత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యువత అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్స్‌తో ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు అంతటి క్రేజ్ దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా ఇందులోని రీల్స్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైంది. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ రీల్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది మెటా. ఇంతకీ ఆ కొత్త అప్‌డేంటి.? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 03, 2023 | 8:28 AM

ఇన్‌స్టాగ్రామ్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది రీల్స్. భారత్‌లో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టా రీల్స్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. యూత్ భారీగా రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసే రోజులు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇన్‌స్టా రీల్స్ టైం పరిమితి కేవలం 90 సెకండ్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్‌స్టా ఈ సమయాన్ని పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రీల్స్ టైం పరిమితిని 10 నిమిషాలకు పెంచేందుకు మెటా ప్రయత్నాలు చేస్తున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే మెటా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సమయాన్ని 10 నిమిషాలకు పెంచడం ద్వారా ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ అయిన యూట్యూబ్‌కు చెక్ పెట్టాలనే ఆలోచనలో ఇన్‌స్టా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం షార్ట్ వీడియోల్లో అత్యధికంగా సమయాన్ని అందిస్తోంది టిక్‌టాక్ మాత్రమే. 10 నిమిషాల కంటే ఎక్కువ నిడివిగల వీడియోలను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని టిక్‌టాక్ తన యూజర్లకు అందిస్తోంది.





























