- Telugu News Photo Gallery Technology photos Huawei mate 60 pro launched with satellite calling feature check here for full details Telugu Tech News
Huawei Mate 60 Pro: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్.. శాటిలైట్ కాలింగ్ సపోర్ట్‌తో
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావే మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌ను లాంచ్ చేసిది. శాటిలైట్ కాలింగ్ వంటి అత్యాధునిక ఫీచర్‌తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఎన్నో అదిరిపోయే ఫీచర్స్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 03, 2023 | 8:54 AM

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే.. హువావే మేట్ 60 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టన్నింగ్ ఫీచర్స్‌ను అందించారు. తర్వలోనే ఈ ఫోన్ భారత్‌లోనూ అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే హువావే మేట్ 60 ప్రో 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర మన కరెన్సీలో రూ. 79,400 వరకు ఉండొచ్చని అంచనా.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో శాటిలైట్ కాలింగ్ అనే అధునాతన ఫీచర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ హార్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్ 4.0 వెర్షన్‌తో పని చేస్తుంది.

ఇందులో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్యూలర్ కనెక్టివిటీ లేకుండానే శాటిలైట్ కాలింగ్‌తో కాల్స్ మాట్లాడుకోవచ్చు. 88 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.





























