- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips do not keep shoes and slippers in this direction of the house it can cause huge loss in Telugu
Vastu Tips: ఇంట్లో చెప్పులను పెట్టె విషయంలో కూడా వాస్తు పాటించాలని తెలుసా.. ఈ దిశలో పెడితే అన్నీ కష్టలేనట..
ఇంటి నిర్మాణంలో వాస్తు శాస్త్రాన్ని.. వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. అయితే వాస్తుని ఇంటి నిర్మాణంపై మాత్రమే కాదు ఆ ఇంట్లోని వస్తువుల అమరికపై కూడా పాటించాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం పేర్కొంది. అవును ఇంటిలోని వాస్తు మనిషి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తుకు సంబంధించిన కొన్ని సానుకూల, ప్రతికూల నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను విస్మరిస్తే, ఆ ఇంట్లో నివసించే వారి జీవితాలపై చెడు ప్రభావం చూపుతుందని నమ్మకం.
Updated on: Sep 02, 2023 | 10:25 AM

వాస్తు దోషాల వల్ల ఇంటి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. అంతేకాదు ఇంట్లోని సభ్యుల్లో వివాదం కూడా కలుగుతుంది. ఆ సమయంలో కుటుంబలో .. కుటుంబ యజమానికి అశాంతిగా మారవచ్చు. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ, విజయం మీ తలుపు తట్టదు. ఇంట్లో వంటగదిలో వస్తువులు, బెడ్ రూమ్ ఇలా ప్రతి వస్తువుల విషయంతో పాటు .. మీ ఇంట్లో చెప్పులను పెట్టుకునే విషయంలో కూడా వాస్తు చిట్కాలు ఉన్నాయి.. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఇంట్లో ఎక్కడపడితే అక్కడ చెప్పులు, బూట్లు ఉంచవద్దని కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇలా చెప్పులను ఎక్కడ బడితే అక్కడ పెట్టడం వలన ఇంటిలోని సభ్యుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి.

ఉత్తరం, తూర్పు దిశల్లో బూట్లు, చెప్పులు ఉంచకూడదు. ఈ దిక్కు లక్ష్మీదేవిది కాబట్టి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. ఈ దిక్కుల్లో పాదరక్షలు, చెప్పులు పెట్టుకునే వారిపై లక్ష్మీదేవి కోపం వస్తుందని విశ్వాసం.

ఇంటి తలుపు వద్ద బూట్లు, చెప్పులను కుప్పలుగా ఉంచడం పూర్తిగా తప్పుగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లోని వ్యక్తుల మధ్య విభేదాలకు దారితీస్తుంది.

చెప్పులు లేదా బూట్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వాటిని తిరిగి ధరించే ముందు ఏదైనా మురికిని తుడిచివేయండి. షూ ర్యాక్‌ను ఎల్లప్పుడూ క్రమబద్ధంగా ఉంచుకోవాలి. చెప్పులను, బూట్లను చిందర వందరగా ఉంచడం వలన ఇబ్బందులు తలెత్తుతాయని విశ్వాసం.

చాలామంది తాము దుస్తులు ధరించేటప్పుడు షూ రాక్‌ని బెడ్ రూమ్ కి తీసుకుని వచ్చి.. తమకు మ్యాచింగ్ చెప్పులను ధరించే అలవాటు ఉంటుంది. అయితే ఇలా బెడ్ రూమ్ లో షూ ర్యాక్ .. ఉండడం వలన వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. అందువల్ల, షూ స్టాండ్‌ని మీ బెడ్ రూమ్ లో ఉంచవద్దు. బయట ఉంచండి.





























