- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips for anger: vastu shastra tips to control anger in Telugu
Vastu Tips for Anger: ప్రతి చిన్న విషయానికి అతిగా కోపం వస్తుందా.. మీ ఇంటి వాతావరణం కూడా ఒక కారణమే.. నియంత్రణ కోసం..
మనిషికి తన భావాలను వ్యక్తీకరించడం సర్వసాధారణం. కోపం, ప్రేమ, బాధ ఇలా తనకు కలిగిన ప్రతి ఫీలింగ్ ను వ్యక్త పరుస్తూ ఉంటాడు. అయితే వీటన్నిటిలో కోపం వలన అనేక కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకనే పెద్దలు తన కోపమే తనకు శత్రువు అని అన్నారు.. అయినప్పటికీ కోపం రావడం అనేది సహజమైన ప్రక్రియ. అయితే కొందరు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటే.. మరికొందరు అతి ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు.
Updated on: Sep 02, 2023 | 8:26 AM

కొందరు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటే.. మరికొందరు అతి ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తారు. ఇలాంటి సందర్భంలో అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా అతని ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కోపానికి కారణం పరిస్థితులు, మనుషుల ప్రవర్తన మాత్రమే కాదు.. ఇంట్లోని వాతావరణం కూడా కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే ఎవరైనా తమ కోపాన్ని నియంత్రించుకోవచ్చు, ఈ రోజు కొన్ని వాస్తు నివారణలను గురించి తెలుసుకుందాం..

ఈ దిశలో నిద్రపోకండి: వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో (అగ్ని కోణం) కూర్చోవడం లేదా నిద్రించడం వల్ల కోపం పెరుగుతుంది. ఎవరికైనా ఎక్కువ అసహనం.. కోపం అధికంగా ఉంటే.. మొదట వ్యక్తి కూర్చుని నిద్రించే ప్రదేశం.. ఆగ్నేయ దిశలో ఉందో లేదో నిర్ధారించుకోవాలి ఉంది. అంతేకాదు ఆఫీసులో కూడా ఆగ్నేయ దిశలో కూర్చునే ఉద్యోగుల్లో కూడా దూకుడు స్వభావం అధికంగా ఉంటుంది.

నిద్రపోయేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు: నిద్రపోతున్నప్పుడు మీ తలను ఎల్లప్పుడూ తూర్పు లేదా దక్షిణం వైపుకు పెట్టుకోండి. దిండు దగ్గర ప్లేట్‌లో క్రిస్టల్ బాల్ లేదా మనసుకు ప్రశాంత నిచ్చే సువాసన వెదజల్లే వస్తువులను పెట్టుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు తూర్పు దిశలో ముఖ్యంగా ఈశాన్య మూలన ఎప్పుడూ భారీ వస్తువులను ఉంచవద్దు.

గదుల్లో ఈ రంగును తక్కువగా ఉపయోగించండి: వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికైనా కోపం అధికంగా ఉంటే..వారు ఎరుపు రంగు వినియోగాన్ని తగ్గించాలని గుర్తుంచుకోండి. గోడలు, బెడ్‌షీట్‌లు, కర్టెన్లు, కుషన్ కవర్‌లపై ఎరుపు రంగును తక్కువగా ఉపయోగించండి. ఎరుపు అంగారక గ్రహానికి చిహ్నం.. కోపాన్ని పెంచుతుంది.. కనుక ఈ రంగుని ఎంత వీలయితే అంత తక్కువగా ఉపయోగించండి.

కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి చేయాల్సిన పనులు: ఇంటి వాతావరణం కూడా కోపం పై ప్రభావం చూపిస్తుంది. దుమ్ము, ధూళి కూడా కోపాన్ని పెంచుతుందని వాస్తు శాస్త్రంలో కూడా నమ్ముతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోని ప్రతి మూలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, వాస్తు ప్రకారం, మీరు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటికి తూర్పు దిశలో దీపం వెలిగించడం ద్వారా కోపాన్ని నియంత్రించుకోగలరు.




