Health Tips: అలసటతో బాధపడుతున్నారా..? ఈ డ్రింక్స్ తాగారంటే క్షణాల్లో ఉపశమనం, రోజంతా రిఫ్రెష్ ఫీల్..
Health Tips: కుటుంబ, ఉద్యోగ వ్యక్తిగత బాధ్యతల కారణంగా నీరసం, ఆలసట అనుభూతి కలగడం సర్వసాధారణం. అయితే ఈ ఆలసట పని కారణంగానే కాక పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా కూడా కొన్ని సందర్భాల్లో సంభవిస్తుంది. ఈ క్రమంలో శరీరానికి కావలసిన పోషకాలు, నీరు అందించడం తప్పనిసరి. ఈ మేరకు ఆలసట చెందినప్పుడు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల దీన్ని అధిగమించవచ్చు. ఇంకా శరీరానికి తక్షణ శక్తి కూడా లభిస్తుంది. మరి అందుకోసం ఏయే డ్రింక్స్ తాగాలో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 02, 2023 | 11:29 AM

నిమ్మరసం: నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్య రక్షణలో మెరుగ్గా పనిచేస్తాయి. నిమ్మ రసం తాగడం వల్ల చెమట రూపంలో శరీరం కోల్పోయిన మినరల్స్, పోషకాలు అన్ని మళ్లీ అందుతాయి. ఫలితంగా మీలోని అలసట దూరమై, తక్షణ శక్తి లభిస్తుంది.

హెర్బల్ టీ: ఇంట్లో తయారు చేసుకున్న హెర్బల్ టీ కూడా అలసటకు చెక్ పెడుతుంది. హెర్బల్ టీ తయారీలో మీరు అల్లం, యాలకులు, శొంఠి వంటివి ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఉప్పు నీరు: ఉప్పు నీటిలో అయోడిన్‌తో పాటు అనేక రకాల మినరల్స్ ఉంటాయి. ఈ నీళ్లను తీసకోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి రావడంతో పాటు శక్తి లభిస్తుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడుతుంది.

గ్రీన్ టీలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని పోషణ, హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని తేమగా మార్చడమే కాకుండా మెరుపును కూడా ఇస్తుంది. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డార్క్ స్పాట్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది.

చెరకు రసం: చెరకు రసంలో శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులోని ప్రోటీన్, ఐరన్, పోటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు అలసట నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు శరీరంలోని డీహైడ్రేషన్‌ను తొలగిస్తాయి. అలాగే శరీరానికి సత్వర శక్తి అందుతుంది.





























