Banana – Obesity: అరటిపండు తింటే బరువు పెరుగుతుందా? ఊబకాయం వస్తుందా.. నిజం ఏంటో తెలుసుకోండి

Banana weight gain: అరటి పండులో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీల కంటెంట్ ఉంటుంది. అరటిపండులో పొటాషియంతో పాటు విటమిన్ ఎ, బి6, సి కూడా మంచి పరిమాణంలో లభిస్తాయి. అందుకే ఆరోగ్యానికి ఈ పండు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. అరటిపండు విషయంలో కొన్ని అపొహలు దాగున్నాయి. కొన్ని సందర్భాలలో అరటి తినొద్దంటూ చెబుతుంటారు. అది నిజమో కాదో తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2023 | 4:51 PM

Banana weight gain: ఉరుకులు పరుగుల జీవితంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలాముఖ్యం. అందుకే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఎల్లప్పుడూ పండ్లను తినమని వైద్యులు సిఫార్సు చేస్తారు. అయితే, కొన్ని పండ్లు ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను అందిస్తాయి. కొన్ని పండ్లు కొన్ని సందర్భాలలో ఆరోగ్యానికి హాని కలిగించే స్వాభావాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ఇందులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.

1 / 6
అరటి పండులో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీల కంటెంట్ ఉంటుంది. అరటిపండులో పొటాషియంతో పాటు విటమిన్ ఎ, బి6, సి కూడా మంచి పరిమాణంలో లభిస్తాయి. అందుకే ఆరోగ్యానికి ఈ పండు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. అరటిపండు విషయంలో కొన్ని అపొహలు దాగున్నాయి. కొన్ని సందర్భాలలో అరటి తినొద్దంటూ చెబుతుంటారు. అది నిజమో కాదో తెలుసుకోండి..

2 / 6
అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారని లేదా ఊబకాయం బారిన పడతారని కొందరు చెప్పడం మీరు వినే ఉంటారు. అరటిపండు బరువును పెంచేదంటూ చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. అరటిపండు తినడం వల్ల నిజంగా బరువు పెరుగుతుందా లేదా అది కేవలం అపోహ మాత్రమేనా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అరటిపండు.. బరువు పెరగడం గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..

3 / 6
అరటిపండులో క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయని, అందుకే దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతారు. అయితే, అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారని లేదా స్థూలకాయం పెరుగుతుందని ఇప్పటి వరకు అరటిపండుకు సంబంధించిన ఏ అధ్యయనమూ చెప్పలేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అపొహ మాత్రమేనంటూ కొట్టిపారేస్తున్నారు.

4 / 6
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అరటిపండులో అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీల కంటెంట్ ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు నిరభ్యంతరంగా తినవచ్చు. ఫైబర్ ఉండటం వల్ల అరటిపండు మీ పొట్టను ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటిపండ్లు యాంటాసిడ్ ప్రభావాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి.

5 / 6
పోషకాహారం విషయంలో కూడా ఈ పండును ఎలాంటి ఆలోచన లేకుండా తినవచ్చు. అరటిపండులో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వాటిలో కెరోటినాయిడ్స్, ఫినోలిక్స్, ఫైటోస్టెరాల్స్, బయోజెనిక్ అమిన్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్ ఎ, బి6, సి కూడా మంచి పరిమాణంలో ఉన్నాయి. విరేచనాలు, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పండు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

6 / 6
Follow us