- Telugu News Photo Gallery Cinema photos Kichcha Sudeep changes his look for upcoming Malaika Arora gives clarity on divorce rumours
Tollywood News: లుక్ మార్చేసిన సుదీప్.. రూమర్స్‌కు చెక్ పెట్టిన మలైకా..
సలార్ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు శ్రుతి హాసన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీకి ఐదు భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు శ్రుతి. మూడు రోజుల్లోనే మూడు భాషల డబ్బింగ్ వర్క్ పూర్తి చేసినట్టుగా వెల్లడించారు. లాంగ్ బ్రేక్ తీసుకున్న కిచ్చా సుదీప్, నెక్ట్స్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న 46వ సినిమా కోసం భారీ వర్కవుట్స్ చేస్తున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Aug 30, 2023 | 5:08 PM

Salaar: సలార్ సినిమాకు సంబంధించి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు శ్రుతి హాసన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాన్ ఇండియా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీకి ఐదు భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు శ్రుతి. మూడు రోజుల్లోనే మూడు భాషల డబ్బింగ్ వర్క్ పూర్తి చేసినట్టుగా వెల్లడించారు.

Sudeep: లాంగ్ బ్రేక్ తీసుకున్న కిచ్చా సుదీప్, నెక్ట్స్ మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న 46వ సినిమా కోసం భారీ వర్కవుట్స్ చేస్తున్నారు. క్లైమాక్స్ ఫైట్ కోసం సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో సిద్ధమవుతున్నారు సుదీప్. ఈ సినిమాను తమిళ నిర్మాత కలైపులి యస్ థాను వి క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

Don 3: డాన్ త్రీక్వెల్‌కు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది. రణవీర్ సింగ్ హీరోగా డాన్ 3ని రూపొందించబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్. గతంలో డాన్ క్యారెక్టర్‌లో నటించిన అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్‌ను ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్.

Malaika Arora: చాలా రోజులుగా డేటింగ్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారన్న వార్తలు వైరల్ అయ్యాయి. కొద్ది రోజులుగా ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు బయటకు రాకపోవటం... అర్జున్, మలైకా కూడా కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయకపోవటంతో ఈ అనుమానాలు కలిగాయి. తాజాగా ఇద్దరు కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీడియో బయటకు రావటంతో రూమర్స్‌కు చెక్ పడింది.

Fighter: హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఏరియల్ యాక్షన్ మూవీ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది. హృతిక్, అనిల్ కపూర్‌ల మీద క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ తరువాత భారీ సెట్‌లో సాంగ్ షూట్ ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్.





























