- Telugu News Photo Gallery Cinema photos Gadar 2 boxoffice collections crosses KGF2, Myositis awareness by Samantha
Tollywood News: కేజీయఫ్2 కలెక్షన్లు దాటేసిన గద్దర్ 2.. మయోసైటిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన విషయాన్ని పిక్‌తో షేర్ చేసి చెప్పారు మేకర్స్. దీంతో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌కి వెళ్తారు పవన్‌కల్యాణ్. తన కుటుంబంతో కలిసి ఓనమ్ పర్వదినాన్ని జరుపుకున్నారు నయనతార. సాంప్రదాయ పద్ధతిలో ఓనమ్‌ని నిర్వహించుకున్నారు. భర్త విఘ్నేష్ శివన్‌తో పాటు, ఇద్దరు కొడుకులతో తీసుకున్న ఫొటోలు షేర్ చేశారు. ఆమె నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. తొలిసారి హిందీ సినిమా చేశారు నయన్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Aug 30, 2023 | 5:08 PM

OG: పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ థాయ్‌ల్యాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన విషయాన్ని పిక్‌తో షేర్ చేసి చెప్పారు మేకర్స్. దీంతో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్‌కి వెళ్తారు పవన్‌కల్యాణ్.

Nayanthara: తన కుటుంబంతో కలిసి ఓనమ్ పర్వదినాన్ని జరుపుకున్నారు నయనతార. సాంప్రదాయ పద్ధతిలో ఓనమ్‌ని నిర్వహించుకున్నారు. భర్త విఘ్నేష్ శివన్‌తో పాటు, ఇద్దరు కొడుకులతో తీసుకున్న ఫొటోలు షేర్ చేశారు. ఆమె నటించిన జవాన్ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. తొలిసారి హిందీ సినిమా చేశారు నయన్.

Gadar 2: గదర్ సీక్వెల్ గురించి గుడ్‌న్యూస్ చెప్పేశారు నార్త్ ట్రేడ్ పండిట్స్. ఈ సినిమా కలెక్షన్లు ఇండియాలో కేజీయఫ్2ని దాటేశాయని టాక్. ఇండియాలో 440 కోట్ల దాకా కలెక్ట్ చేసింది గదర్ సీక్వెల్. దీంతో ఇండియాలో థర్డ్ హయ్యస్ట్ గ్రాసర్ హిందీ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

Bhairava Dweepam: బాలకృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది భైరవద్వీపం. నటుడిగా బాలయ్య 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 30న రీరిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి 4కె ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణకు జోడీగా రోజా నటించారు.

Samantha: సమంత రూత్ ప్రభు ఇప్పుడు మయోసైటిస్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఆమెకు మయోసైటిస్ ఉన్న విషయం తెలిసింది. ఆటో ఇమ్యూన్ కండిషన్ గురించి జనాలకు అవగాహన కలిగించనున్నారు సమంత.





























