G-20 Summit: జో బైడెన్‌కు కరోనా నెగెటివ్.. జీ-20 సదస్సుకు పూర్తిగా మాస్కుతో..
భారత రాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం దేశాధినేతలు తరలిరానున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన ఖాయమేనని.. వైట్ హౌస్ ప్రకటించింది. అయితే మరో విషయం శ్వేతసౌధం వెల్లడించింది. ఈ జీ20 పర్యటన వేళ ఆయన కొవిడ్ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తారని.. మాస్క్‌లో కనిపిస్తారని తెలిపింది. మరోవైపు బైడెన్‌కు మంగళవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది.

భారత రాజధాని ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సు కోసం దేశాధినేతలు తరలిరానున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన ఖాయమేనని.. వైట్ హౌస్ ప్రకటించింది. అయితే మరో విషయం శ్వేతసౌధం వెల్లడించింది. ఈ జీ20 పర్యటన వేళ ఆయన కొవిడ్ మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తారని.. మాస్క్‌లో కనిపిస్తారని తెలిపింది. మరోవైపు బైడెన్‌కు మంగళవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మరోవైపు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు కొవిడ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఇండియా వస్తారా లేదా అనే అనుమానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన సోమవారం నాడు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అందులో నెగెటివ్ వచ్చింది. మళ్లీ మంగళవారం కూడా టెస్టులు చేయించుకున్నారు. ఈసారి కూడా నెగెటివ్‌గానే రిపోర్టు వచ్చింది.
దీంతో జో బైడెన్ పర్యటనలో ఎలాంటి మార్పు ఉండబోదని శ్వేతసౌధం తాజాగా ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారమే ఇండియాలో జరగనున్న జీ-20 సదస్సుకు ఆయన హాజరవుతారని మరోసారి తెలిపింది. ఢిల్లీ పర్యటనను ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి వియత్నాం వెళ్తారని చెప్పింది. అలాగే ఈ పర్యటనలల్లో జో బైడెన్.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్దేశించినటువంటి కొవిడ్-19 గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటిస్తారని పేర్కొంది. ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపింది. అలాగే బైడెన్ ఆరోగ్యాన్ని నిరంతరం వైద్యులు పర్యవేక్షిస్తారని చెప్పింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అయితే భారత్‌కు వెళ్లేముందు ఆయనతో పాటుగా వచ్చే ప్రతినిధుల బృందానికి మళ్లీ కొవిడ్ పరీక్షలు చేయనున్నారు. పర్యటన సమయంలో బైడెన్ జాగ్రత్తలు తీసుకుంటారని.. ఎప్పుడూ మాస్క్ ధరిస్తారని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జీన్‌పెర్రి మీడియాకు చెప్పారు.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 7వ తేదీన బైడెన్ ఢిల్లీకి రానున్నారు. 8న భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఇక 9.10 వ తేదీల్లో జరగనున్న జీ-20 దేశాధినేతల సదస్సులో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా వియాత్నం వెళ్లనున్నారు. జీ20 సదస్సుకు బైడెన్‌కతో పాటు.. ఫ్రాన్, ఆస్ట్రేలీయా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా తదితర దేశాధినేతలు హాజరుకానున్నారు. ఇక సెప్టెంబర్ 10వ తేదీన జీ-20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షునికి అప్పగించనున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో జీ20 సమావేశాల వాతావరణం మొదలైపోయింది. ఎక్కడ చూసినా నగరంలో జీ-20 పోస్టర్లు, ఫ్లేక్సీలు కనిపిస్తున్నాయి.