AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 నెలల చిన్నారి కడుపులో కవలలు..! రెండు గంటలు శ్రమించి ఆపరేషన్‌ చేసిన వైద్యులు..

గుక్కపట్టి ఏడుస్తున్న 10నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ చేశారు. తొలుత బాలిక కడుపు కింది భాగంలో కణితి లాంటిది ఏర్పడి ఉంటుందని భావించారు. ఆపరేషన్ చేసి కణతిని తొలగించాలని చెప్పిన డాక్టర్లు.. రెండు గంటల పాటు శ్రమించి సర్జరీ చేశారు..

10 నెలల చిన్నారి కడుపులో కవలలు..! రెండు గంటలు శ్రమించి ఆపరేషన్‌ చేసిన వైద్యులు..
New Born Baby
Jyothi Gadda
|

Updated on: Sep 06, 2023 | 11:06 AM

Share

ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆ మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దాని కోసం తొమ్మిది నెలలు ఎదురుచూస్తుంది. కానీ, ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా..? అవును…ఇది వినేందుకు షాకింగ్‌ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 10 నెలల చిన్నారికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లిదండ్రులు వైద్యులు షాకింగ్‌ విషయాన్ని చెప్పారు. అది విన్న ఆ తల్లిదండ్రులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఇదీ అని చెప్పలేని బాధతో చిన్నారి ఏడుస్తుంది. తరచూ పాప ఏడుపు ఆపకపోవడంతో ఆ తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ శిశువు కడుపు కింది భాగంలో నొప్పి వస్తున్నట్టుగా వైద్యులు గమనించారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా, పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెర పోయారు. 10నెలల శిశువు కడుపులో రెండు జంట పిండాలు కనిపించాయి.

ఈ షాకింగ్‌ ఘటన పాకిస్థాన్‌లోని సాదికాబాద్‌లో చోటు చేసుకుంది. గుక్కపట్టి ఏడుస్తున్న 10నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ చేశారు. తొలుత బాలిక కడుపు కింది భాగంలో కణితి లాంటిది ఏర్పడి ఉంటుందని, బాలిక కడుపు ద్రవంతో నిండిపోయిందని వారు భావించారు. దానికోసం వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు చిన్నారికి ఆపరేషన్‌ నిర్వహించారు. సర్జరీ చేసి బాలిక పొత్తికడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి మరో షాకింగ్‌ సీన్‌ కనిపించింది.

బాలికకు ఆపరేషన్‌ చేసిన కణతిని తొలగించిన వైద్యులు..బాలిక కడుపులో పూర్తిగా ఎదగని రెండు జంట పిండాలను గుర్తించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒకరికి మాత్రమే వచ్చే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధికి ఆ బాలిక బాధితురాలు అని డాక్టర్లు స్పష్టం చేశారు. తల్లి కడుపులో పిండం ఒక బిడ్డ అభివృద్ధి చెందినప్పుడు కవల పిండాలు ఆరోగ్యవంతమైన శిశువు శరీరంలో ఇలా ఇరుక్కుపోయాయని.. అవి అభివృద్ధి చెందలేనప్పుడు ఇలాంటిది జరుగుతుందని సర్జన్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. చిన్నారికి ఆపరేషన్ చాలా కష్టంగా మారిందన్నారు. రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు పాప ఆపరేషన్‌ సక్సెస్‌ చేశారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఏసీ, ఫ్రిజ్ ఫుల్లుగా వాడినా జీరో కరెంట్ బిల్‌.. ఎలా అంటే?
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!