Andhra Pradesh: పామును తినేందుకు.. బాత్రూంలో దూరిన గిరి నాగు..! శబ్దాలతో హడల్.. దాని పొడవు ఎంతో చూస్తే..

Anakapalli: గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. జెర్రీ గొడ్డు అనే పాముని వేటాడింది. దాన్ని తినటానికి వెంబడిస్తూ బాత్రూం లోకి దూరింది. అక్కడే కోళ్ళ గూడు ఉండడంతో అందులోకి వెళ్ళింది. దీంతో అక్కడ నుంచి శబ్దాలు రావడంతో భయభ్రాంతులకు గురైన రమేష్... స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చారు. రంగంలో ఒక దిగిన స్నేక్ క్యాచర్..

Follow us
Maqdood Husain Khaja

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 06, 2023 | 9:39 AM

ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం06:  ఓ భారీ పాము.. దాని పొడవు పది అడుగుల పైనే..! ఆకలితో ఉంది.. ఆహారం కోసం వెతుకుతుంది.. ఇంతలో మరో పాము కనిపించింది. దాన్ని తినేందుకు వెంటాడింది. వేటాడి పట్టుకోడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ భారీ శబ్దాలు వినిపించాయి.. అనకాపల్లి జిల్లాలో ఓ భారీ గిరి నాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ మరో పామును వెంబడించింది. బాత్రూం సమీపంలో ఉన్న కోళ్ల గూట్లోకి దూరింది. శబ్దాలు విని ఆందోళన చెందిన ఆ కుటుంబం భయంతో.. వణికిపోయింది.

– అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామంలో 13 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. ఎలమంచిలి రమేష్ అనే రైతు ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూంలోకి దూరింది. ఈ 13 అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. జెర్రీ గొడ్డు అనే పాముని వేటాడింది. దాన్ని తినటానికి వెంబడిస్తూ బాత్రూం లోకి దూరింది. అక్కడే కోళ్ళ గూడు ఉండడంతో అందులోకి వెళ్ళింది. దీంతో అక్కడ నుంచి శబ్దాలు రావడంతో భయభ్రాంతులకు గురైన రమేష్… స్థానిక స్నేక్ క్యాచర్ వెంకటేష్ కు సమాచారం ఇచ్చారు. రంగంలో ఒక దిగిన స్నేక్ క్యాచర్.. 13 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచి పెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

– సాధారణంగా గిరి నాగులు మనుషుల జోలికి రావు. ప్రాణహాని తలపెట్టవు. కానీ వాటి జీవనానికి భంగం కలిగించాలని చూస్తే అంతే సంగతులు. నిటారుగా నిల్చుని నెత్తిన కాటేయడం గిరినాగు లక్షణం. అందుకే ఎక్కడ ఇటువంటి పాములు కనిపించినా.. దాన్ని డిస్టర్బ్ చేయకుండా పాములు పట్టే నేర్పరికి సమాచారం అందించాలి. పట్టుకొని వాటికి సురక్షిత ప్రాంతాలైన అడవుల వైపు వదిలిపెట్టాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?