Green Tea: జాగ్రత్త..! ఇలా తాగితే గ్రీన్ టీ కూడా విషమే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!

గ్రీన్‌ టీఆరోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా ఎక్కువగా తినడం మన శరీరానికి మంచిది కాదు. అలాగే, గ్రీన్ టీని అతిగా తాగటం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు తలెత్తె అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Green Tea: జాగ్రత్త..! ఇలా తాగితే గ్రీన్ టీ కూడా విషమే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2023 | 7:20 AM

బరువు తగ్గాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలనుకునే వారు తమ ఆహారంలో భాగంగా చేసుకున్న పానీయం గ్రీన్ టీ. ఎందుకంటే ఇది మన శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. కానీ, గ్రీన్‌ టీఆరోగ్యానికి మంచిదని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏదైనా ఎక్కువగా తినడం మన శరీరానికి మంచిది కాదు. అలాగే, గ్రీన్ టీని అతిగా తాగటం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలు తలెత్తె అవకాశం ఉందంని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

అధికా బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి గ్రీన్‌ టీ ఉత్తమ మార్గం. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. పొట్ట, నడుము కొవ్వు సులభంగా కరుగుతుంది. అదే సమయంలో క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కొందరిలో కాలేయ సమస్యలు వస్తాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ టీలోని కాటెచిన్స్, ముఖ్యంగా EGCG (ఎపిగల్లోకాటెచిన్ గాలెట్) కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి గ్రీన్ టీ హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గ్రీన్ టీ భయాన్ని, ఆందోళనను కలిగిస్తుంది. గ్రీన్‌ టీ అధికంగా తీసుకోవటం వల్ల ఇది తలనొప్పికి కారణం కావచ్చు. ఇది రక్తపోటును తగ్గించే అవకాశం కూడా ఉంది. ఇది అశాంతిని కలిగిస్తుంది. ఇది నిద్రలేమికి కూడా కారణం అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తుంది. మీరు గ్రీన్ టీ తీసుకున్న తర్వాత ఏవైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ గమనించినట్టయితే.., మీరు వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

* ఇకపోతే, గ్రీన్ టీతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

– గ్రీన్ టీ తీసుకునే ముందు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి:

– గ్రీన్ టీ తీసుకునేటప్పుడు గర్భిణీలు, పాలిచ్చే మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

– కాలేయ వ్యాధులు ఉన్నవారు గ్రీన్ టీ తీసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

– మీకు ముందుగా ఏవైనా వ్యాధులు ఉంటే గ్రీన్ టీని తీసుకునే ముందు మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

– ఇతర మందులతో పరస్పర చర్యలు:

పెరుగుతున్న బరువు తగ్గడానికి రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ సరిపోతుంది. ఇంతకు మించి తాగవద్దు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీరు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలి. లేకుంటే అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద రోగాలను నివారించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..