Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Precautions: నోట్లో ఈ లక్షణాలు ఉంటే మీకు షుగర్ ఉన్నట్లే!! తస్మాత్ జాగ్రత్త!

ఇప్పుడున్న కాలంలో అందర్నీ వేధించే మరో ప్రధానమైన సమస్య 'డయాబెటీస్'. రోజు రోజుకూ ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంటుంది. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం. ఆహారం, అలవాట్లు సరిగ్గా ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే షుగర్ ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఏంటో తెలీక చాలా మంది తీవ్రతరం చేసుకుంటున్నారు. దీంతో వారు అనారోగ్యానికి గురై సతమతమవుతూ ఉంటున్నారు. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తేనే మధుమేహం..

Diabetes Precautions: నోట్లో ఈ లక్షణాలు ఉంటే మీకు షుగర్ ఉన్నట్లే!! తస్మాత్ జాగ్రత్త!
Diabetes
Follow us
Chinni Enni

|

Updated on: Sep 05, 2023 | 10:50 PM

ఇప్పుడున్న కాలంలో అందర్నీ వేధించే మరో ప్రధానమైన సమస్య ‘డయాబెటీస్’. రోజు రోజుకూ ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంటుంది. మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం. ఆహారం, అలవాట్లు సరిగ్గా ఉంటేనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే షుగర్ ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఏంటో తెలీక చాలా మంది తీవ్రతరం చేసుకుంటున్నారు. దీంతో వారు అనారోగ్యానికి గురై సతమతమవుతూ ఉంటున్నారు. ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తేనే మధుమేహం ఉన్నట్లు అని భావిస్తారు.

కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కోసారి మూత్రం ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందుచేత షుగర్ వచ్చినట్టు అనుకోవడం పొరపాటే. మరే ఇతర సమస్య అయినా అయి ఉండొచ్చు. యూరిన్ ఇన్ ఫెక్షన్ అయి కూడా ఉండొచ్చు. అయితే తరచుగా తప్పకుండా బాగా అధికంగా మూత్ర విసర్జన చేయడం, ఆకలి, అసట, నిరసం వంటి లక్షణాలతో పాటు నోరు చూసి కూడా మధుమేహంతో బాధపడుతున్నారా? లేదో చెప్పవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

– తరచూ నాలిక ఎండిపోవడం లేదా పొడి బారుతూ ఉంటే టైప్-1 లేదా టైప్-2 డయాబెటీస్ తో బాధపడుతున్నట్లే.

ఇవి కూడా చదవండి

– నోట్లో పుండ్లు వంటి వాటితో పాటు మాట్లాడటం, మింగడం, నమలడం వంటివి కూడా కష్టంగా మారుతాయి.

– పెదవులు ఎండిపోయి పగులుతాయి.

– చిగుళ్ల వాపులు, రక్తం కారడం, చిగుళ్లు నొప్పిగా ఉండటం వంటివి కూడా షుగర్ కిందకే వస్తాయి.

– అలాగే దంతాలు కూడా వదులుగా ఉండి, ఊడిపోతూ ఉంటాయి.

ఇలా నోట్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం మేలు. పరీక్షలు చేయించుకుని నిర్థారణకు వచ్చాక వెంటనే తగిన చికిత్స తీసుకుంటే మేలు. లేదంటే ఈ వ్యాధి ముదిరి చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. బీటా కణాలు దెబ్బతింటాయి. అలాగే శరీరం కూడా హైడ్రేషన్ కు గురై, కంటి చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మూత్ర పిండాల పని తీరు కూడా మందగిస్తుంది. రక్త నాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇలా ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే.. ఆరోగ్యంగా ఉండొచ్చే.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి