Ginger Benefits: ఇమ్యూనిటీ బూస్ట్ గా అల్లం.. ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు

మనం రోజువారీ ఉపయోగించే వాటిల్లో అల్లం ఒకటి. ఉదయం టీతో మొదలు మసాలాలు అన్నింటిల్లో అల్లాన్ని బాగా ఉపయోగిస్తాం. భారత దేశంలో అల్లం, వెల్లుల్లి లేని ఇల్లు ఉండదు. ఇది ఉపయోగించకుండా ఏ నాన్ వెజ్ కర్రీ పూర్తి అవ్వదు. పులావ్, బిర్యాన్నీ, నాన్ వెజ్ కూరల్లో అల్లం తప్పనిసరిగా ఉండాల్సిందే. పురాతన కాలం నుంచి అల్లంను ఉపయోగిస్తున్నారు. ఇక ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది అల్లం. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చూసే గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇంకా అల్లంతో అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అల్లాన్ని ఎలా తీసుకున్నా..

Ginger Benefits: ఇమ్యూనిటీ బూస్ట్ గా అల్లం.. ఇంకా ఎన్నెన్నో ప్రయోజనాలు
Ginger
Follow us

|

Updated on: Sep 03, 2023 | 8:05 PM

మనం రోజువారీ ఉపయోగించే వాటిల్లో అల్లం ఒకటి. ఉదయం టీతో మొదలు మసాలాలు అన్నింటిల్లో అల్లాన్ని బాగా ఉపయోగిస్తాం. భారత దేశంలో అల్లం, వెల్లుల్లి లేని ఇల్లు ఉండదు. ఇది ఉపయోగించకుండా ఏ నాన్ వెజ్ కర్రీ పూర్తి అవ్వదు. పులావ్, బిర్యాన్నీ, నాన్ వెజ్ కూరల్లో అల్లం తప్పనిసరిగా ఉండాల్సిందే. పురాతన కాలం నుంచి అల్లంను ఉపయోగిస్తున్నారు. ఇక ఆయుర్వేదంలో అల్లంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది అల్లం. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చూసే గుణాలు అల్లంలో ఉన్నాయి. ఇంకా అల్లంతో అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అల్లాన్ని ఎలా తీసుకున్నా కూడా.. దాని నుంచి బెస్ట్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. అల్లాన్ని పచ్చిగా నమిలినా లేదా జ్యూస్ లలో ఉపయోగించి తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే.

ఇమ్యూనిటీ బూస్టింగ్:

అల్లాన్ని ‘ఇమ్యూనిటీ బూస్టింగ్’ గా చెప్పవచ్చు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణం అల్లంలో ఉంది. బాడీ అంతర్గతంగా క్లీన్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

షుగర్ ని నియంత్రణలో ఉంచుతుంది:

అల్లం తీసుకున్నవాళ్లకు షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా అల్లాన్ని తీసుకుంటే.. రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది.

కండరాల్లో నొప్పిని తగ్గిస్తుంది:

వ్యాయామాలు చేశాక కండరాల్లో నొప్పి వస్తుంది. ఇలాంటి వాటిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే కాస్త నెమ్మదిగా ఇది ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కీళ్లు, ఆర్థరైటీస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగించ వచ్చు.

బరువును తగ్గిస్తుంది:

బరువును కంట్రోల్ చేసే గుణం అల్లంలో ఉంది. అల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. అల్లం ఆకలిని తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో అల్లం సహాయ పడుతుంది. పరగడుపునే అల్లం రసం సేవిస్తే.. మెటబాలిజం పెరుగుతుంది.

జలుబు, దగ్గుకు ఉపశమనం:

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయ పడుతుంది. ఉదయం అల్లం టీ తాగితే.. ఇవన్నీ కంట్రోల్ లోకి వస్తాయి.

అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది:

అజీర్తి సమస్యలకు చక్కగా పని చేస్తుంది అల్లం. దీర్ఘకాలిక అజీర్తి సమస్యలతో బాధపడే వారికి అల్లం చాలా మంచిది. కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది. వికారంతో బాధపడుతున్న వారికి ఇది మంచి మందు కూడా.

ఇంకా దంత సమస్యలు, వికారం, వాంతులు, మహిళల్లో నెలసరి సమస్యలు ఇలా ఎలాంటి వాటినైనా అల్లం దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..