Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home tips for Theeth: అల్లం-నిమ్మకాయతో ఇలా చేయండి.. దంతాలు మిలమిలమని మెరుస్తాయి!

ముఖం అందంగా కనిపించడంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నవ్వినప్పుడు దంతాలు చక్కగా ఉంటే.. అందం మరింత రెట్టింపు అవుతుంది. అయితే కొంది మందికి పళ్లు పసుపు రంగులో, గార పట్టి ఉంటాయి. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన వలసి ఉంటుంది. నలుగురిలో నవ్వాలన్నా, సరిగ్గా మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దంతాలపై ఉండే గారను, పసుపు దనాన్ని తొలగించుకోవడానికి మార్కెట్ లోకి ఎన్నో రకాల టూత్ పేస్టులు వచ్చాయి. అయితే వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండక నిరుత్సాహ పడుతూ ఉంటారు. మరికొంత మంది వేలకు వేలు వెచ్చించి మరీ..

Home tips for Theeth: అల్లం-నిమ్మకాయతో ఇలా చేయండి.. దంతాలు మిలమిలమని మెరుస్తాయి!
Home Tips for teeth
Follow us
Chinni Enni

|

Updated on: Sep 03, 2023 | 6:00 PM

ముఖం అందంగా కనిపించడంలో దంతాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నవ్వినప్పుడు దంతాలు చక్కగా ఉంటే.. అందం మరింత రెట్టింపు అవుతుంది. అయితే కొంత మందికి పళ్లు పసుపు రంగులో, గార పట్టి ఉంటాయి. దీని వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. నలుగురిలో నవ్వాలన్నా, సరిగ్గా మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. దంతాలపై ఉండే గారను, పసుపు దనాన్ని తొలగించుకోవడానికి మార్కెట్ లోకి ఎన్నో రకాల టూత్ పేస్టులు వచ్చాయి.

అయితే వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండక నిరుత్సాహ పడుతూ ఉంటారు. మరికొంత మంది వేలకు వేలు వెచ్చించి మరీ ట్రీట్ మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా గార పట్టి, పసుపు రంగులో ఉండే సమస్యలతో ఇబ్బంది పడే వారు.. ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న చిట్కాలను వాడటం వల్ల.. ఆ సమస్యల నుంచి బయట పడొచ్చు. దీంతో డబ్బు కూడా ఆదా అవుతుంది. మరి ఆ చిట్కా ఏంటో.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కా తయారు చేసుకోవాడానికి మనకు కావాల్సిన పదార్థాలు:

ఇవి కూడా చదవండి

అర చెక్క నిమ్మరసం, ఒక ఇంచు అల్లం, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నిమ్మ తొక్క తురుము.

లిక్విడ్ తయారీ విధానం:

ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసేసి తురుముకుని గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మ రసాన్ని పిండుకుని.. తొక్కను పడేయకుండా.. దాన్ని కూడా తురుముకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి.. బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ ని బ్రష్ తో తీసుకుని.. దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పళ్లపై ఉండే గార, పసుపు రంగు మరకలు పోయి.. తెల్లగా మిలమిలమని మెరుస్తాయి. అంతేకాకుండా నిమ్మరసం వల్ల నోటిలోని దుర్వాసన పోతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి