Kitchen hacks: బియ్యానికి పురుగు పడుతుందా.. ఈసారి ఈ చిట్కాలను ట్రై చేయండి!!

సాధారణంగా మనం నెలకి సరిపడగా వంట సరుకులు తెచ్చుకుంటాం. వాటిల్లో బియ్యం కూడా ఒకటి. మరికొంత మంది బియ్యాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరానికి సరిపడా తీసుకుని నిల్వ చేస్తారు. అయితే ఇలా నిల్వ చేసుకున్న బియ్యం, దినుసులకు పురుగు పడుతూ ఉంటాయి. పురుగులతో పాటు వాటి లార్వాలు, గుడ్లు కూడా ఉంటాయి. ఇలా పురుగు పట్టిన బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కడుపులో ఇన్ ఫెక్షన్లు, కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు..

Kitchen hacks: బియ్యానికి పురుగు పడుతుందా.. ఈసారి ఈ చిట్కాలను ట్రై చేయండి!!
Rice Get Insects
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 5:56 PM

సాధారణంగా మనం నెలకి సరిపడగా వంట సరుకులు తెచ్చుకుంటాం. వాటిల్లో బియ్యం కూడా ఒకటి. మరికొంత మంది బియ్యాన్ని ఆరు నెలలు లేదా సంవత్సరానికి సరిపడా తీసుకుని నిల్వ చేస్తారు. అయితే ఇలా నిల్వ చేసుకున్న బియ్యం, దినుసులకు పురుగు పడుతూ ఉంటాయి. పురుగులతో పాటు వాటి లార్వాలు, గుడ్లు కూడా ఉంటాయి. ఇలా పురుగు పట్టిన బియ్యం తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కడుపులో ఇన్ ఫెక్షన్లు, కడుపులో నొప్పి, విరేచనాలు, వాంతులు వంటికి ఎదురవుతాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ కి కూడా దారితీయవచ్చు. మరి బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని గృహిణులు తల పట్టుకుంటారు. దీంతో బయట షాపుల్లో దొరికే రసాయనాలను తీసుకొచ్చి.. బియ్యం, పప్పు దినుసులపై చల్లుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా ప్రమాదమే. ఇలా బయట దొరికే రసాయనాల కంటే.. ఇంటి చిట్కాలను వాడి బియ్యం, పప్పు దినుసులకు పురుగు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.

ఫ్రిజ్ లో పెట్టాలి:

ఓట్స్, ధాన్యాలు, పిండి, పప్పు దినుసులు వంటి వాటిని కొనుగోలు చేసిన తర్వాత నాలుగు రోజుల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేస్తే పురుగు పట్టకుండా, వాటిలో ఉండే లార్వా, గుడ్లు నశిస్తాయి.

ఇవి కూడా చదవండి

అగ్గి పుల్లలు:

బియ్యం, పప్పు దినుసులు స్టోరేజ్ చేసే ప్రదేశాల్లో, డబ్బాల్లో అగ్గి పెట్టెను తెరిచి పెట్టాలి. అగ్గి పుల్లలకు ఉండే సల్ఫర్ ఆహార పదార్థాలకు పురుగు పట్టకుండా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

వేప ఆకులు ఉంచాలి:

పిండ్లు, ధాన్యాలు, బియ్యం స్టోరేజ్ చేసే వాటిల్లో పచ్చి వేపాకులు పెట్టాలి. ఇలా పెడితే పురుగు పట్టదు.

లవంగాలు:

లవంగాలు కూడా బియ్యం, పిండ్లు, పప్పు దినుసులకు పురుగు పట్టకుండా చూస్తుంది. లవంగాల ఘాటు వలన పురుగుల వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇంటి సరుకులు నిల్వ చేసే కబోర్డులు, ఆల్మారాల్లో కూడా అక్కడక్కడ లవంగాలు ఉంచడం బెటర్.

ఎండలో పెట్టాలి:

ఎక్కువ కాలం వంట సరుకులు, బియ్యం నిల్వ ఉండాలంటే అప్పుడప్పుడు ఎండలో పెడితే బెటర్. ఎండలో పెట్టడం వల్ల పురుగులు సులభంగా నశిస్తాయి. వాటిలో ఉండే లార్వాలు, గుడ్లు కూడా తొలగిపోతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి