Healthy Snack: హెల్దీ స్నాక్ ‘రాగి రిబ్బన్ పకోడాలు’.. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్!!
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి.. హెల్దీ ఫుడ్ కి ఓటేస్తున్నారు. చిరు ధాన్యాలతో కూడా మనం ఇంట్లో ఈజీగా పిండి వంటలను తయారు చేసుకోవచ్చు. చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగి పిండితో 'రాగి రిబ్బన్ పకోడా' చేసుకోవచ్చు. వీటి వలన రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. రాగి పిండితో చేసే రిబ్బన్ పకోడాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం ఉన్నవారు కూడా వీటిని..
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి.. హెల్దీ ఫుడ్ కి ఓటేస్తున్నారు. చిరు ధాన్యాలతో కూడా మనం ఇంట్లో ఈజీగా పిండి వంటలను తయారు చేసుకోవచ్చు. చిరు ధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగి పిండితో ‘రాగి రిబ్బన్ పకోడా’ చేసుకోవచ్చు. వీటి వలన రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. రాగి పిండితో చేసే రిబ్బన్ పకోడాలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తీసుకుంటే చాలా మంచిది. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ రిబ్బన్ పకోడాలను మనం ఇంట్లో కూడా ఈజీగా, చాలా తక్కువ టైమ్ లో తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి రిబ్బన్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, బటర్ – పావు కప్పు, నీళ్లు – అర కప్పు కంటే కొద్దిగా తక్కువ, బియ్యం పిండి – పావు కప్పు, శనగ పిండి – పావు కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రాగి రిబ్బన్ పకోడా తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని, బియ్యం పిండి, శనగ పిండి క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. ఈ మూడు పిండులను ఒకసారి కలిపి.. ఆ తర్వాత ఉప్ప, జీలకర్ర, నువ్వులు, కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బటర్ వేసి మరోసారి కలపాలి. తర్వాత నీళ్లు పోసు కుంటూ పిండిని జంతికలకు కలుపుకున్నట్లు కలుపుకోవాలి. తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకుని దానికి నూనె రాసుకోవాలి.
ఆ నెక్ట్స్ అందులో రిబ్బన్ పకోడా తయారు చేసుకోవడానికి అవసరమయ్యే బిళ్లను ఉంచి పిండిని ఉంచాలి. ఈలోపు మరో మూకుడిలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెయ్యాక రిబ్బన్ పకోడాలను నూనెలో వత్తుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే రాగి రిబ్బన్ పకోడాలు రెడీ. ఇవి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా మనం ఇంట్లో హెల్దీ స్నాక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి