Side Effects of Mobile: పడుకునేటప్పుడు మొబైల్ ను దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగం బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. అది లేకపోతే.. పిల్లలు కనీసం నిద్ రకూడా పోవడం లేదు. రోజులు, నెలల పిల్లల నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధుల వరకూ స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిపోయారు. ఉదయం లేవగానే ఫోన్.. రాత్రి పడుకునేటపుడు కూడా దానినితలకింద పెట్టుకుని పడుకుంటారు. ఈ తప్పు చాలా మంది చేస్తున్నారు. నిద్రించేటపుడు ఫోన్ ను తల కింద పెట్టుకోవడం అంత మంచి అలవాటు కాదని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. పరికరంతో నిద్రపోవడం హానికరమైన అలవాటు అని..

Side Effects of Mobile: పడుకునేటప్పుడు మొబైల్ ను దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
Mobile side effects
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2023 | 9:00 AM

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉపయోగం బాగా పెరిగిపోయింది. ఎంతలా అంటే.. అది లేకపోతే.. పిల్లలు కనీసం నిద్ రకూడా పోవడం లేదు. రోజులు, నెలల పిల్లల నుంచి 60 ఏళ్లు దాటిన వృద్ధుల వరకూ స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిపోయారు. ఉదయం లేవగానే ఫోన్.. రాత్రి పడుకునేటపుడు కూడా దానినితలకింద పెట్టుకుని పడుకుంటారు. ఈ తప్పు చాలా మంది చేస్తున్నారు. నిద్రించేటపుడు ఫోన్ ను తల కింద పెట్టుకోవడం అంత మంచి అలవాటు కాదని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. పరికరంతో నిద్రపోవడం హానికరమైన అలవాటు అని, ఇది నిద్ర లేమి ఇతర వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 2020లో చేసిన అధ్యయనం ప్రకారం.. నిద్రించేముందు ఫోన్ వాడకాన్ని 4 వారాలపాటు తగ్గించడం వల్ల నిద్ర నాణ్యత, వ్యవధి, పని చేసే సామర్థ్యం మెరుగుపడతాయని తేలింది. ఫోన్ ను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే మరి ఎలాంటి సమస్యలు దారి తీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫోన్ ను ఇలా ఛార్జ్ చేయవద్దు: మనిషి ఫోన్ కు పూర్తిగా దూరంగా ఉండటం అసాధ్యం. అందుకే.. ఆపిల్ సంస్థ తన ఆన్‌ లైన్ యూజర్ గైడ్‌ ను అప్‌ డేట్ చేసింది, బెడ్‌ లో ఉన్నప్పుడు ఫోన్‌ ను ఛార్జ్ చేయవద్దని ఐఫోన్ వినియోగదారులను కోరింది. మొబైల్ వేడెక్కడం, ఫైర్ అవ్వడంపై అలర్ట్ చేసింది.

వెంటిలేషన్ ఉన్న వాతావరణంలో ఉంచాలి: ఐఫోన్‌ లను బాగా వెంటిలేషన్ చేసే వాతావరణంలో ప్రత్యేకంగా ఛార్జ్ చేయాలని, టేబుల్ వంటి ఫ్లాట్ ఉపరితలంపై మొబైల్స్ ను ఛార్జ్ చేయాలని గైడ్ లైన్స్ లో సూచించింది. ముఖ్యంగా దుప్పట్లు, దిండ్లు లేదా మీ శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఛార్జింగ్ చేయడాన్ని నిషేధంగా పేర్కొంది.

ఇవి కూడా చదవండి

నిద్ర పట్టదు: రీల్స్ ను ఎక్కువగా చూస్తూ ఉండటం వల్ల.. దాని కాంతి కళ్లపై పడి నిద్ర పట్టదు. నిద్రించడానికి సమయం ఆసన్నమైందని మీ మెదడు , శరీరాన్ని సూచిస్తుంది. అలాంటి పరిస్థితిలో, నిద్రపోతున్నప్పుడు ఫోన్ మీకు దూరంగా ఉంటే వెంటనే నిద్రపోవచ్చు.

కంటి సమస్యలు వస్తాయి: పడుకునే ముందు ఫోన్ ను తదేకంగా చూసే అలవాటును మానుకోవాలి. లేదంటే మున్ముందు విపరీతమైన తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి