Banana Benefits and Side effects: అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారా ? నిపుణులు చెప్పింది ఇదే..!

మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరికొన్నింటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఏది తినాలి? ఏది తినకూడదు? ఏది తింటే ఏం జరుగుతుందన్న విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. కొన్ని పండ్లు, ఫుడ్ ఐటమ్స్ వల్ల బరువు పెరుగుతారు. అలాంటి వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండు రోజూ తింటే బరువు పెరుగుతారా ? అనే సందేహం ఇప్పటికీ చాలామందికి ఉంది. అరటిపండు కూడా ఆరోగ్యాన్ని..

Banana Benefits and Side effects: అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారా ? నిపుణులు చెప్పింది ఇదే..!
పోషకాహారం విషయంలో కూడా ఈ పండును ఎలాంటి ఆలోచన లేకుండా తినవచ్చు. అరటిపండులో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. వాటిలో కెరోటినాయిడ్స్, ఫినోలిక్స్, ఫైటోస్టెరాల్స్, బయోజెనిక్ అమిన్స్ వంటి అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్ ఎ, బి6, సి కూడా మంచి పరిమాణంలో ఉన్నాయి. విరేచనాలు, కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ పండు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2023 | 9:30 AM

మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరికొన్నింటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ఏది తినాలి? ఏది తినకూడదు? ఏది తింటే ఏం జరుగుతుందన్న విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. కొన్ని పండ్లు, ఫుడ్ ఐటమ్స్ వల్ల బరువు పెరుగుతారు. అలాంటి వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండు రోజూ తింటే బరువు పెరుగుతారా ? అనే సందేహం ఇప్పటికీ చాలామందికి ఉంది. అరటిపండు కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసే పండ్లలో ఒకటి అంటున్నారు నిపుణులు.

డైలీ తింటే స్థూలకాయానికి ఆహ్వానం పలికినట్లే:

ఆరోగ్యానికి మంచి చేసే పండ్ల లిస్టులో అరటిపండ్లది టాప్ ప్లేస్. కానీ ఇవి రోజూ తింటే స్థూలకాయానికి ఆహ్వానం పలికినట్లేనని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గించే ఆహారంలో దీన్ని చేర్చుకోవచ్చు కానీ రోజూ తింటే ప్రమాదమేనని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ పడుకునే ముందు అరటిపండు తినకూడదని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కడుపు నిండిన భావన:

అరటి పండ్లు తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ కాలం ఆకలిని నివారిస్తుంది. అరటిపండులో ఫినోలిక్స్, కెరోటినాయిడ్స్, బయోజెనిక్ అమిన్స్, ఫైటోస్టెరాల్ బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి సహాయపడే అన్ని పోషకాలు అరటి పండులో ఉన్నాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయ పడతాయి. నాడీ వ్యవస్థను బలపరుస్తుంది.

డయారేయాకు అరటిపండు బెస్ట్:

డయారేయి చికిత్సకు బనానా బెస్ట్ అని చెప్పవచ్చు. డయేరియా సమయంలో అరటిపండు తీసుకోవడం వల్ల ఉపశమనం లభించింది. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం ఎలక్ట్రోలైట్ లను భర్తీ చేస్తుంది.

విరేచనాలను తగ్గిస్తుంది:

అలాగే అరటిపండ్లలో పొటాషియం, విటమిన్లు A, B6 ,C ఉంటాయి. ఇది విరేచనాలను తగ్గిస్తుంది. కడుపులో పుండు, అసిడిటీ, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చర్మ సౌందర్యంతో పాటు జుట్టు పెరగడానికి దోహదపడుతుంది.

అరటి పండుకు బదులు చక్కెర కేళి తినొచ్చు:

ఒకవేళ మీరు అధికబరువు ఉండి, అరటి పండును తినడం మానలేక పోతే.. దానికి ప్రత్యామ్నాయంగా చక్కెర కేళిని తినొచ్చు. ఇది తినడం వల్ల బరువు పెరగరు. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి