Kitchen Hacks: గ్యాస్ స్టవ్, బర్నర్ లను ఈజీగా ఇలా క్లీన్ చేసుకోండి!!
వంటింట్లో ప్రతిరోజూ గ్యాస్ స్టవ్ ని ఉపయోగించాల్సిందే. ఉదయం టీ- కాఫీలతో మొదలు.. టిఫిన్లు, వంటలు.. అలా రాత్రి వరకూ దీనిని వాడుతూనే ఉంటారు. ఫలితంగా గ్యాస్ స్టవ్ మురికిగా మారుతుంది. వంటల్లో వాడే నూనె స్టవ్ పై పడి జిడ్డుగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే బ్యాక్టీరియా, క్రిము, కీటకాలు చేరే ప్రమాదం. తద్వారా మనం చేసే వంటల్లో అవి చేరే ప్రమాదం కూడా లేదు. అయితే వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో గ్యాస్..
వంటింట్లో ప్రతిరోజూ గ్యాస్ స్టవ్ ని ఉపయోగించాల్సిందే. ఉదయం టీ- కాఫీలతో మొదలు.. టిఫిన్లు, వంటలు.. అలా రాత్రి వరకూ దీనిని వాడుతూనే ఉంటారు. ఫలితంగా గ్యాస్ స్టవ్ మురికిగా మారుతుంది. వంటల్లో వాడే నూనె స్టవ్ పై పడి జిడ్డుగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే బ్యాక్టీరియా, క్రిము, కీటకాలు చేరే ప్రమాదం. తద్వారా మనం చేసే వంటల్లో అవి చేరే ప్రమాదం కూడా లేదు. అయితే వంటింట్లో ఉండే కొన్ని వస్తువులతో గ్యాస్ స్టవ్ పై పేరుకున్న మురికిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ తో జిడ్డు పోతుంది:
ఉల్లిపాయను గుండ్రపు ముక్కలుగా కట్ చేసుకుని వాటిని 20 నిమిషాల పాటు నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని చల్లార్చి.. వాటితో గ్యాస్ ఓవెన్ ను తుడవాలి. ఈ నీరు గ్యాస్ స్టవ్ పై పేరుకున్న జిడ్డును ఈజీగా తొలగిస్తుంది.
వెనిగర్:
గ్యాస్ బర్నర్ లను క్లీన్ చేసేందుకు వెనిగర్ ను వాడొచ్చు. కొన్ని చుక్కలను బర్నర్ పై వేసి.. కొద్దిసేపటి తర్వాత స్పాంజితో తుడవాలి. ఆ తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ సబ్బుతో కడిగి గ్యాస్ బర్నర్ బాగా మెరుస్తుంది.
బేకింగ్ సోడా:
బేకింగ్ సోడాతో నిమ్మరసం, వెనిగర్ కలిపి.. ఈ మిశ్రమంతో గ్యాస్ ఓవెన్, బర్నర్ ను శుభ్రంగా క్లాత్ తో తుడవాలి. ఇలా వారానికి రెండుసార్లు క్లీన్ చేస్తే.. జిడ్డు, స్టవ్ పై పడిన ఆహారం వల్ల కాలిన మచ్చలు ఉండవు.
హాట్ వాటర్ – ఉప్పు:
వేడి నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి.. అందులో బర్నర్లను వేసి 15-20 నిమిషాలు ఉడికించాలి. కాస్త చల్లారిన తర్వాత బర్నర్లను తీసి డిష్ వాషర్ లేదా సబ్బుతో స్క్రబ్ చేసి కడిగితే.. బర్నర్లు మెరుస్తాయి.
వైట్ వెనిగర్ – బేకింగ్ సోడా:
ఒక గిన్నె నీటిలో వైట్ వెనిగర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. గ్యాస్ బర్నర్ ను ఈ మిశ్రమంలో 2 గంటలపాటు నానబెట్టాలి. ఈ బర్నర్ ను తీసుకుని డిష్ సోప్ వేసి.. టూత్ బ్రష్ లేదా స్క్రబ్ తో బర్నర్ ను స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఈ సింపుల్ చిట్కాలతో మీ వంటింట్లో గ్యాస్ స్టవ్ తళతళా మెరుస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి