AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Insulin Deficiency: ఇన్సులిన్ లోపాన్ని తగ్గించుకోవాలంటే.. నిపుణులు సూచించిన ఈ 6 ఆహారాలను తింటే చాలు!!

చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవడం దీని ప్రధాన లక్షణం. ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతే ఆహారం నుంచి గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియ జరుగదు. అందుకే వైద్యుల సలహా మేరకు తప్పనిసరిగా కృత్రిమ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. శరీరంలో ఆగిపోయిన ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి జరగాలంటే.. ప్రధానంగా 6 రకాల ఆహారాలను తీసుకోవాలి సూచిస్తున్నారు పోషకాహార..

Insulin Deficiency: ఇన్సులిన్ లోపాన్ని తగ్గించుకోవాలంటే.. నిపుణులు సూచించిన ఈ 6 ఆహారాలను తింటే చాలు!!
Diabetes
Chinni Enni
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 03, 2023 | 3:13 PM

Share

చిన్నవయసులోనే టైప్ 2 డయాబెటీస్ తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోవడం దీని ప్రధాన లక్షణం. ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతే ఆహారం నుంచి గ్లూకోజ్ ను శక్తిగా మార్చే ప్రక్రియ జరుగదు. అందుకే వైద్యుల సలహా మేరకు తప్పనిసరిగా కృత్రిమ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. శరీరంలో ఆగిపోయిన ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి జరగాలంటే.. ప్రధానంగా 6 రకాల ఆహారాలను తీసుకోవాలి సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

మొలకెత్తిన పెసర్లు: మొలకెత్తిన పెసర్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. స్టార్చ్ ప్రొటీన్ సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్సులిన్ లోపాన్ని కూడా వేగంగా నివారిస్తుంది. వీటిని రోజూ పరగడుపున లేదా స్నాక్ గా కూడా తినవచ్చు.

కొబ్బరి ముక్కలు: కొబ్బరి ముక్కలలో అధికగ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాల్లో నిరూపితమైంది. కొబ్బరిలో ఫైబర్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. సహజ సంతృప్తకొవ్వులుంటాయి. కొబ్బరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పెరుగు: ఇది ప్రో బయోటిక్ ఆహారంగా, ఇన్సులిన్ ను నిరోధకతను నియంత్రించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగులో అవిసెగింజలను కలిపి తింటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఇవి రెండూ కలిసి ఇన్సులిన్ ను ఉత్తేజపరిచేందుకు పనిచేస్తాయి.

చియాసీడ్స్: చియాసీడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి.. సమతుల్యం చేస్తాయి. చియాసీడ్స్ ను యథాతదంగానే తీసుకోవాలి. కృత్రిమ స్వీటెనర్లను కలిపి తీసుకుంటే.. ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు.

అవకాడో: ఇది ఇన్సులిన్ లోపాన్ని నియంత్రించడంలో గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఇది సంతృప్త కొవ్వు, ఫైబర్ లను కలిగి ఉంటుంది. క్యారెట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది.

రైస్ క్రాకర్లు: ఇవి కొరియన్, జపనీస్ వంటకాల్లో బాగా ఉపయోగిస్తాయి. మనకు సూపర్ మార్కెట్లలో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. బియ్యంతో తయారైన ఈ రైస్ క్రాకర్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందట. వీటిని బాదంబట్టర్ తో కలిపి తింటే ఇన్సులిన్ లోపాన్ని నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి