Hangover Side Effects: వీకెండ్ హ్యాంగోవర్ తగ్గడం లేదా.. ఈ 5 డ్రింక్స్ తో రిలాక్స్ అవ్వండి!!

వీకెండ్ వస్తే చాలు.. ఎక్కువ శాతం మంది మగవారు మందుతో చిల్ అవ్వడానికే ప్రాధాన్యమిస్తారు. పబ్ లు, పార్టీలు.. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా. ఇక బ్యాచిలర్ పార్టీల్లో ఎంత తాగుతారో లెక్కుండదు. సంతోషమైనా, బాధైనా, పెళ్లైనా, ఫంక్షనైనా.. చుక్క లేకపోతే కిక్కుండదు. అయితే.. మందుతాగిన మరునాడే చాలా మందికి హ్యాంగోవర్ తో తల పట్టేస్తుంది. దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు. తల ఊగిపోతున్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి బయట పడేందుకు కొందరు మజ్జిగ, ఇంకొందరు వేడి వేడి కాఫీ తాగుతారు. అయినా హ్యాంగోవర్ నుంచి అంత త్వరగా బయటపడలేరు. తలనొప్పి, కళ్లు..

Hangover Side Effects: వీకెండ్ హ్యాంగోవర్ తగ్గడం లేదా.. ఈ 5 డ్రింక్స్ తో రిలాక్స్ అవ్వండి!!
Hangover Side Effects
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 03, 2023 | 3:14 PM

వీకెండ్ వస్తే చాలు.. ఎక్కువ శాతం మంది మగవారు మందుతో చిల్ అవ్వడానికే ప్రాధాన్యమిస్తారు. పబ్ లు, పార్టీలు.. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కూడా. ఇక బ్యాచిలర్ పార్టీల్లో ఎంత తాగుతారో లెక్కుండదు. సంతోషమైనా, బాధైనా, పెళ్లైనా, ఫంక్షనైనా.. చుక్క లేకపోతే కిక్కుండదు. అయితే.. మందుతాగిన మరునాడే చాలా మందికి హ్యాంగోవర్ తో తల పట్టేస్తుంది. దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు. తల ఊగిపోతున్నట్టు ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి బయట పడేందుకు కొందరు మజ్జిగ, ఇంకొందరు వేడి వేడి కాఫీ తాగుతారు. అయినా హ్యాంగోవర్ నుంచి అంత త్వరగా బయటపడలేరు. తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, కండరాలనొప్పి, అధికదాహం, హై బీపీ, గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు లేదా చెమట హ్యాంగోవర్ లక్షణాలు. పడుకుని లేచాక కూడా మత్తులో నుంచి తేరుకోకపోవడాన్నే హ్యాంగోవర్ అంటారు. అలాంటి హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే.. వీటిలో ఏదొక డ్రింక్ ను ట్రై చేయండి.

అల్లం రసం: అల్లం కడుపునొప్పిని తగ్గిస్తుంది. కడుపులో ఉన్న ఆల్కహాల్ ను త్వరగా జీర్ణం చేయడంలో అల్లం సహాయపడుతుంది. అల్లం రసాన్ని యథాతదంగా లేదా నీళ్లలో కలుపుకుని తాగితే.. హ్యాంగోవర్ నుంచి బయటపడొచ్చు.

పుదీనా రసం: పుదీనా ఆకులతో కూడా హ్యాంగోవర్ ను తగ్గించుకోవచ్చు 3-4 పుదీనా ఆకుల్ని వేడినీటిలో కలుపుకుని తాగితే హ్యాంగోవర్ పోతుంది. ఉదర సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. పేగులకు ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

లెమన్ టీ: ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడేందుకు లెమన్ టీ చాలా ఉపయోగపడుతుంది. హ్యాంగోవర్ తగ్గాలంటే ఒక గ్లాసు చల్లటినీటిలో నిమ్మరసం, చక్కెర, ఉప్పు కలిపి తాగాలి. వెంటనే రిలీఫ్ ఉంటుంది. వికారం, కడుపులో మంట కూడా తగ్గుతాయి.

యాపిల్స్ – అరటి పండ్లు: హ్యాంగోవర్ నుంచి బయటపడేందుకు ఫ్రూట్స్ కూడా ఉపయోగపడుతాయి. యాపిల్స్, అరటి పండ్లు హ్యాంగోవర్ ను తగ్గిస్తాయి. అరటిపండును తేనెతో కలిపి షేక్ లా చేసుకుని తాగితే హ్యాంగోవర్ తగ్గుతుంది.

తేనె: ఆల్కహాల్ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో తేనె సహాయపడుతుంది. చల్లటి నీటిలో లేదా కాస్త గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తాగితే హ్యాంగోవర్ నుంచి బయటపడొచ్చు. ఇది జీవక్రియ, జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి