పైకి చూపించేది వేరు.. కానీ ఇచ్చేది మరొకటి.. బర్గర్ కింగ్ సంస్థపై కోర్టులో కేసు
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో బర్గర్లు, శాండ్ విచ్ లు, పీజ్జాలు, చికెన్ రోల్స్ వంటి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి పల్లె టూర్లలో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా అందరూ వీటిని లొట్టలేసుకుని తినేస్తున్నారు. కానీ వాటి నుంచి వచ్చే రోగాల లిస్ట్ చూస్తే మాత్రం దిమ్మ దిమ్మ తిరగాల్సిందే. ఈ విషయం పక్కన పెడితే.. బర్గర్ కింగ్.. ఈ కంపెనీ జంక్ ఫుడ్ గురించి చాలా మందికి తెలుసు. అతి తక్కువ రేట్లకే వీళ్లు ఫుడ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అందులోనూ బర్గర్లకు ప్రత్యేకం ఈ బర్గర్ కింగ్ కంపెనీ. ఫాస్ట్ ఫుడ్ సర్వ్ చేసే అన్ని కంపెనీల్లో బాగా పేరు..
ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో బర్గర్లు, శాండ్ విచ్ లు, పీజ్జాలు, చికెన్ రోల్స్ వంటి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ప్రపంచాన్నే శాసిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి పల్లె టూర్లలో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. చిన్న వారి నుంచి పెద్ద వారి దాకా అందరూ వీటిని లొట్టలేసుకుని తినేస్తున్నారు. కానీ వాటి నుంచి వచ్చే రోగాల లిస్ట్ చూస్తే మాత్రం దిమ్మ దిమ్మ తిరగాల్సిందే. ఈ విషయం పక్కన పెడితే.. బర్గర్ కింగ్.. ఈ కంపెనీ జంక్ ఫుడ్ గురించి చాలా మందికి తెలుసు. అతి తక్కువ రేట్లకే వీళ్లు ఫుడ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అందులోనూ బర్గర్లకు ప్రత్యేకం ఈ బర్గర్ కింగ్ కంపెనీ. ఫాస్ట్ ఫుడ్ సర్వ్ చేసే అన్ని కంపెనీల్లో బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తాజాగా ఈ సంస్థ కంపెనీకి చుక్కెదురైంది.
యాడ్స్ లలో ఒకటి చూపించి.. క్వాటింటీ మాత్రం సరిగ్గా ఇవ్వకుండా కస్టమర్లను మోసం చేస్తున్నారంటూ పలువురు అమెరికాలోని కోర్టులో కేసులు వేశారు. యాడ్స్ లలో ఏకంగా 35 శాతం ఎక్కువగా చికెన్, వెజిటేబుల్స్ ఉన్నట్టు చూపించి.. వినియోగ దారులను తప్పుదారి పట్టిస్తున్నారంటూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. కస్టమర్లకు సరైన క్వాంటిటీ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం తన బర్గర్ ల పరిమాణాన్ని కేవలం వాణిజ్య ప్రకటనలలో మాత్రమే అధికంగా ఉన్నట్లు చూపిస్తున్నారని కోర్టులో పేర్కొన్నారు. మెను-ఐటెమ్ లను పక్క పక్కన పెట్టి చూస్తే చాలా తేడా కనిపిస్తుందని కోర్టులో పేర్కొన్నారు.
అయితే ఇది కామన్ అని, ఈ విషయాన్ని తోసి పుచ్చాలని బర్గర్ కింగ్ సంస్థ కోర్టులో వాదనలు వినిపించింది. అయితే ఈ వాదనలను న్యాయస్థానం కొట్టి పడేసింది. కస్టమర్లను చీట్ చేస్తున్నారని, వినియోగదారులకు సరైన న్యాయం చేయాలని తీర్పునిచ్చింది. దీంతో సదరు పిటిషనర్ దారులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ బర్గర్ కింగ్ పై గతంలోనూ ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. వాణిజ్య ప్రకటనల్లో చూపించేది ఒకటి.. ఇచ్చే క్వాంటిటీ మాత్రం సరిగ్గా లేదని పలువురు అమెరికాలోని కోర్టుకెక్కారు. చూపించే దానికంటే ఇచ్చే క్వాంటిటీ తక్కువగా ఉందని బర్గర్ కింగ్ పై కోర్టులో కేసులు వేశారు. అయితే ఈ ఫిర్యాదులను బర్గర్ కింగ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా వేసిన కేసుతో బర్గర్ కింగ్ సంస్థ దిగి వచ్చింది.
బర్గర్ కింగ్ సంస్థ 1953లో జాక్సన్ విల్లేలోని ఫ్లోరిడాలో చిన్న బర్గర్ చైన్ గా ప్రారంభించింది. ఆ తర్వాత ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ గా విస్తరించింది. ప్రస్తుతం అనేక దేశాల్లో బర్గర్ కింగ్.. ప్రముఖ జంక్ ఫుడ్ సంస్థగా పేరు గాంచింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి