Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron Benefits: కుంకుమ పువ్వుతో ఎన్నో ప్రయోజనాలు.. పాలతో ఇలా తీసుకున్నారంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం..

Saffron Benefits: ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం కలిగిన కుంకుమ పువ్వుతో మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీనిలోని పోషకాల కారణంగానే దీన్ని వంట గదిలో, ఔషధాల తయారీలో ఇంకా ఇతర పద్ధతుల్లో ఉపయోగిస్తారు. అసలు కుంకుమ పువ్వును ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 30, 2023 | 10:04 PM

ఊభకాయంకు పరిష్కారం: బరువు తగ్గాలనుకునేవారు కుంకుమ పువ్వును ఉపయోగిస్తే మేలు జరుగుతుంది. దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి కడుపు సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే ఆకలి కోరికను నియంత్రించి బరువు తగ్గేలా చేస్తుంది.

1 / 5
షుగర్ లెవెల్స్ కంట్రోల్: కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగితే టైప్-2 మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది బాధపడేవారికి మేలు జరుగుతుంది. అలాగే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

2 / 5
చర్మ సంరక్షణ: సోరియాసిస్ సమస్యకు చెక్ పెట్టేందుకు కుంకుమపువ్వు మెరుగ్గా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇంకా దీనిలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు తొలగిపోవడానికి సహాయపడతాయి.

3 / 5
ఒత్తిడికి చెక్: కుంకుమ పువ్వు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. దీనిలోని పోషకాలు  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం అందిస్తాయి.

4 / 5
నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం: కుంకుమ పువ్వు తనలోని ఔషధ గుణాల కారణంగా ఋతుస్రావ సమయంలో కలిగే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం మీరు పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగితే సరిపోతుంది.

5 / 5
Follow us