Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poha Idli Recipe: పోహాతో నిమిషాల్లో టేస్టీ ఇడ్లీలను తయారు చేసుకోండిలా..!!

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో రకరకాల టిఫిన్లు తింటుంటారు కదూ. ఇడ్లీ, దోసె, పూరీ, బజ్జీ.. ఇలా చాలా రకాలుంటాయి. అవన్నీ తినే.. ఎంత కష్టపడినా తరగని శరీరం పెరిగిపోతుంటుంది. దానిని తగ్గించుకోవాలంటే.. మళ్లీ నోరు కట్టుకోవాల్సింది. కోరిన ఆహారాన్ని తినలేక.. డైట్ లో ఉండే ఫుడ్ నచ్చక నానా ఇబ్బందులూ పడుతుంటారు కదూ. ఇటీవల మనం ఇడ్లీలకు బదులుగా రాగి వెజిటబుల్ ఇడ్లీలు ఎలా చేసుకుని తినవచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు అటుకులతో ఇడ్లీలను ఎలా చేయాలో తెలుసుకుందాం. అటుకులు లేదా పోహాతో చేసే ఈ ఇడ్లీ.. చాలా త్వరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా..

Poha Idli Recipe: పోహాతో నిమిషాల్లో టేస్టీ ఇడ్లీలను తయారు చేసుకోండిలా..!!
Poha Idli
Follow us
Chinni Enni

|

Updated on: Aug 30, 2023 | 10:58 AM

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో రకరకాల టిఫిన్లు తింటుంటారు కదూ. ఇడ్లీ, దోసె, పూరీ, బజ్జీ.. ఇలా చాలా రకాలుంటాయి. అవన్నీ తినే.. ఎంత కష్టపడినా తరగని శరీరం పెరిగిపోతుంటుంది. దానిని తగ్గించుకోవాలంటే.. మళ్లీ నోరు కట్టుకోవాల్సింది. కోరిన ఆహారాన్ని తినలేక.. డైట్ లో ఉండే ఫుడ్ నచ్చక నానా ఇబ్బందులూ పడుతుంటారు కదూ. ఇటీవల మనం ఇడ్లీలకు బదులుగా రాగి వెజిటబుల్ ఇడ్లీలు ఎలా చేసుకుని తినవచ్చో నేర్చుకున్నాం. ఇప్పుడు అటుకులతో ఇడ్లీలను ఎలా చేయాలో తెలుసుకుందాం. అటుకులు లేదా పోహాతో చేసే ఈ ఇడ్లీ.. చాలా త్వరగా జీర్ణమవుతుంది. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ తినేందుకు రుచిగా కూడా ఉంటాయి. ఈ పోహా ఇడ్లీ తయారీకి ఏయే పదార్థాలు కావాలో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం.

పోహా ఇడ్లీ తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు:

అటుకులు – 1 కప్పు, రైస్ రవ్వ – 1.1/2 కప్పు, పెరుగు – 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ – 3/4 టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా అటుకులను 10 నిమిషాలపాటు నీటిలో నానబెట్టుకుని.. మిక్సీ జార్ లో వేసి ముతకగా రుబ్బుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకుని.. దానికి 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పిండిలో పెరుగు పూర్తిగా కలిసిపోయేంతవరకూ కలపాలి. ఇందులో 1/2 కప్పు బియ్యంరవ్వ లేదా ఉప్మా రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో 1 కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక అరగంట పాటు మూతపెట్టి నాననివ్వాలి.

అరగంట తర్వాత ఈ మిశ్రమంలో మరో అరకప్పు నీరుపోసి బాగా కలిపి.. చివరిగా ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇడ్లీ కుక్కర్ తీసుకుని..అందులోని ప్లేట్స్ కు ఆయిల్ రాసి.. పోహా ఇడ్లీ పిండిని వేసి.. 15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పోహా ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీని చట్నీ, సాంబారుతో సర్వ్ చేసుకుని తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి