AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin C: ప్రతిరోజూ విటమిన్ సి అవసరమే.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో అందరూ బిజీ లైఫ్‌ను గడిపేస్తున్నారు. అంతేకాదు చాలామంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. అందుకే ఒకప్పుడు లేని అనేక రోగాలు ఇప్పుడు ఎంతోమందిని పీడిస్తున్నాయి. అందుకే ఆరోగ్య నిపుణలు ప్రతిఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచనలు చేస్తున్నారు. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అవసరమవుతుంటాయి. ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో లభిస్తుంటాయి.

Vitamin C: ప్రతిరోజూ విటమిన్ సి అవసరమే.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా ?
Vitamin C
Aravind B
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 30, 2023 | 8:35 AM

Share

ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో అందరూ బిజీ లైఫ్‌ను గడిపేస్తున్నారు. అంతేకాదు చాలామంది తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. అందుకే ఒకప్పుడు లేని అనేక రోగాలు ఇప్పుడు ఎంతోమందిని పీడిస్తున్నాయి. అందుకే ఆరోగ్య నిపుణలు ప్రతిఒక్కరు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచనలు చేస్తున్నారు. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అవసరమవుతుంటాయి. ఇవి ఎక్కువగా పండ్లు, కూరగాయల్లో లభిస్తుంటాయి. అయితే మనిషి శరీరానికి ప్రతిరోజూ కూడా విటమిన్ సి అనేది అవసరమవుతుంది. ఈ విటమిన్ శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపరచడంతో సహా ఉత్సాహాన్ని, హుషారును కలగజేస్తుంది విటమిన్ సి. ముఖ్యంగా మెదడులో ఉండే నాడీ సమాచార వాహికల ఉత్పత్తికి ఈ విటమిన్ సి అనేది అత్యవసరంగా పనిచేస్తుంది.

వాస్తవానికి డోపమైన్ అనే నాడీ సమాచార వాహకం సంతోషాన్ని.. ఉత్సహాన్ని కలిగిస్తుంది. అందుకోసమే దీనికి సంతోష రసాయనం అని కూడా అంటారు. కానీ ఒకవేల విటమిన్ సి శరీరానికి సరిగ్గా అందకపోతే డొపమైన మోతాదులు చాలావరకు పడిపోతాయి. అయితే మనిషిలో నార్ ఎపినెఫ్రిన్ మోతాదులు పడిపోయినట్లైతే నిరాశ, ఆందోళన వంటివి కలుగుతాయి. వీటివల్ల కూడా అనేక రకాల మానసిక వ్యాధులు వచ్చేస్తాయి. మరో విషయం ఏంటంటే.. డోపమైన్ నార్ ఎపినెఫ్రిన్‌లు మనిషికి మెదడు వాపు ప్రక్రియను తలెత్తకుండా ఉండేందుకు ఎంతగానో తోడ్పడతాయి. ప్రస్తుతం మానసిక వైద్యులు ఈ మెదడు వాపు తలెత్తకుండా దీన్ని నివారించడం కోసం దీనిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే ఇక్కడ మెదడుకు, పేగుకు బలమైన బంధం కూడా ఉంది. పేగుల్లో ముఖ్యంగా వాపు ప్రక్రియను నిలవరించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం విటమిన్ సి ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే ఈ వాపు ప్రక్రియ నుంచి బయటపడాలంటే చాలావరకు బలం కావాలి. ఇక విటమిన్ సి వల్ల కేలరీలు అంతగా లభించవు. కానీ శక్తి మాత్రం వస్తుంది. అందుకోసమే తరచుగా కుంగుబాటు, నిరాశ, ఆందోళనకు గురవుతున్నట్లుగా అనిపించినట్లైతే విటమిన్ సి లభించే పదార్థాలను తింటూ ఉండాలి. అలాగే ప్రతిరోజూ కూడా మనకు సుమారు 65 గ్రాముల నుంచి 90 మిల్లీగ్రాముల వరకు విటమిన్ సి అనేది అవసరం అవుతుంది. అయితే ఇది బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లలో అలాగే క్యాప్సికం, బ్రకోలీ వంటి వాటిల్లో కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇక ఎర్ర క్యాప్సికంలో చూసుకుంటే 342 మిల్లీ గ్రాములు.. బ్రకోలీలో 89 మిల్లీగ్రాముల విటమిన్ సి లభిస్తుంది. ఇలా తేలికగానే విటమిన్ సి ని పొందవచ్చి. అలాగే ఉత్సాహాన్ని, హుషారుని పొందవచ్చు. అయితే ఇంకెందుకు ఆలస్యం ఇలాంటివి మీరు కూడా తీసుకొని ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి