Vinayaka Chaviti: వినాయక చవితి తేదీపై గందరగోళం.. సెప్టెంబర్ 18 లేదా 19న ఏ రోజు జరుపుకోవాలనే విషయంపై తెలంగాణ విద్వత్సభ క్లారిటీ..
ఇటీవల ఏ పండగలు వచ్చినా ఆ పండగల తేదీలపై ఒక కన్ఫ్యూజన్ నెలకొంటుంది. రాఖీ పండుగ సైతం ఆగస్టు 30న అని కొంతమంది అంటే.. 31న అని మరికొంతమంది అంటున్నారు. ఈ తరహా లోనే సెప్టెంబర్ నెలలో వచ్చిన వినాయక చవితి వేడుకపై కూడా గందరగోళం నెలకొంది. చవితి వేడుకలను 18వ తేదీన నిర్వహించాలని తెలంగాణ పంచాంగ కర్తలు అంటుంటే లేదు 19వ తేదీన వినాయక చవితి జరపాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి చెబుతుంది.
వచ్చేనెల వినాయక చవితి ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది అయితే వినాయక చవితి ఏ రోజున జరపాలన్న దానిపై ఇప్పుడు గురుకుల చర్చ నడుస్తుంది. ఇటీవల ఏ పండగలు వచ్చినా ఆ పండగల తేదీలపై ఒక కన్ఫ్యూజన్ నెలకొంటుంది. రాఖీ పండుగ సైతం ఆగస్టు 30న అని కొంతమంది అంటే.. 31న అని మరికొంతమంది అంటున్నారు. ఈ తరహా లోనే సెప్టెంబర్ నెలలో వచ్చిన వినాయక చవితి వేడుకపై కూడా గందరగోళం నెలకొంది. చవితి వేడుకలను 18వ తేదీన నిర్వహించాలని తెలంగాణ పంచాంగ కర్తలు అంటుంటే లేదు 19వ తేదీన వినాయక చవితి జరపాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి చెబుతుంది. దీంతో వినాయకుని భక్తుల్లో ఏ రోజున ఉత్సవాలు ప్రారంభించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది
తెలంగాణలోని సిద్ధాంతులు, పండితులంతా కలిసి ఒక విద్వత్సవ ఫోరం పెట్టుకున్నామని పండితులు చెబుతున్నారు. తాము హిందువుల పండగలు జరుపుకునే విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నామని చెప్పారు. ఇటీవల వినాయక చవితి తేదీ కూడా సెప్టెంబర్ 18 అని నివేదిక ఇచ్చామని. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించిందని పేర్కొన్నారు.
అయితే భాగ్యనగర ఉత్సవ సమితి మాత్రం వినాయక చవితిని 19వ తేదీన జరపాలని భక్తులను కోరుతుంది. చవితి 18వ తేదీ మధ్యాహ్నం 1:00కు ప్రారంభమై 19వ తేదీ మధ్యాహ్నం 1:00కు ముగుస్తుంది. అయితే తిధి ఏ రోజైతే సూర్యోదయం ఉంటుందో ఆ రోజునే పండుగ రోజుగా గుర్తించే సాంప్రదాయం మన తెలుగు వాళ్ళకు ఆనాదిగా వస్తుందని భాగ్యనగర ఉత్సవ సమితి చెబుతుంది. కనుక సూర్యోదయం ఉన్న 19వ తేదీన వినాయక చవితి పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించాలని ఉత్సవ సమితి కోరుతుంది. అయితే 18వ తేదీన చేసుకుంటామనే వాళ్ళని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ కూడా వారు చెబుతున్నారు.
ప్రభుత్వం 18వ తేదీన వినాయక చవితి సెలవు ప్రకటించడంతో ప్రస్తుతం పండితులకు, ఉత్సవ సమితులకు మధ్య నెలకొన్న ఈ వివాదంలో అందరితో కూర్చుని ప్రభుత్వం వినాయక చవితి వేడుకనుఁ జరుపుకునే తేదీపై కూడా ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని వినాయక మండపాల నిర్వాహకులతో పాటు భక్తులు కోరుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..