Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangla Gauri Vratam: నేడు శ్రావణ మంగళవారం.. వివాహం కానీ యువతలు శివపార్వతులను ఎలా పూజించాలి.. ఉద్యాపన ఎలా చేయాలంటే

వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, పిల్లల సంతోషం కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మరోవైపు ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా పెళ్లికాని అమ్మాయిలు తల్లి గౌరీదేవి కోరుకున్న వరాన్ని ఇస్తుందని.. మంచి వరుడిని వరంగా ప్రసాదిస్తాడని నమ్మకం. అదేవిధంగా మంగళగౌరి వ్రతానికి నియమాలు,  నిబంధనల ప్రకారం చేసే పూజలకు చాలా సంతోషిస్తుంది. తనను కోరి కొలిచిన భక్తులు కోరిన వరాలను ఇస్తుంది.

Mangla Gauri Vratam: నేడు శ్రావణ మంగళవారం.. వివాహం కానీ యువతలు శివపార్వతులను ఎలా పూజించాలి.. ఉద్యాపన ఎలా చేయాలంటే
Mangala Gouri Devi Vratam
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2023 | 8:49 AM

పవిత్రమైన శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు, వ్రతాలు, శుభకార్యాలలో సందడి నెలకొంటుంది. రేపు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ. మరోవైపు నేడు శ్రావణ మంగళ వారం. ఈ రోజు మంగళ గౌరీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో పూజని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పార్వతిదేవి తన భక్తులకు సంతోషాన్ని, సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది. అదే విధంగా శ్రావణ సోమవారం శివయ్య అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక శ్రావణ మంగళవారం పార్వతిదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున శాస్త్రోక్తంగా చేసే పూజలు శుభ ఫలితాలను ఇస్తాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. భర్త దీర్ఘాయుస్సు కోసం పార్వతి దేవి అనుగ్రహాన్ని మహిళలు ఎలా పొందవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..

వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, పిల్లల సంతోషం కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మరోవైపు ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా పెళ్లికాని అమ్మాయిలు తల్లి గౌరీదేవి కోరుకున్న వరాన్ని ఇస్తుందని.. మంచి వరుడిని వరంగా ప్రసాదిస్తాడని నమ్మకం. అదేవిధంగా మంగళగౌరి వ్రతానికి నియమాలు,  నిబంధనల ప్రకారం చేసే పూజలకు చాలా సంతోషిస్తుంది. తనను కోరి కొలిచిన భక్తులు కోరిన వరాలను ఇస్తుంది.

మంగళ గౌరీ వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే

  1. శ్రావణ మాసం మంగళ గౌరీ వ్రతం కోసం ఉదయాన్నే నిద్రలేచి, ముందుగా స్నానం చేసి, ఇంటిని ఇంట్లోని పూజ గదిని శుభ్రం చేయండి.
  2. ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై శివపార్వతుల విగ్రహాన్ని లేదా చిత్ర పటాన్ని ప్రతిష్టించండి.
  3. శివపార్వతులను అత్యంత భక్తి శ్రద్దలతో పూజించండి. పూజలో పసుపు, కుంకుమ, అక్షతలు, మిఠాయిలు, పండ్లు, పూలు, ధూపం, దీపం, తాంబూలం, తమలపాకులు, తేనె ఉండేలా చూసుకోండి.
  4. మంగళ గౌరీ మాతను ప్రసన్నం చేసుకోవడానికి, ఆరాధన సమయంలో ముత్తైదువుకి చిహ్నమైన గాజులు, చీర జాకెట్, పసుపు కుంకుమ వంటి 16 రకాల వస్తువులను సమర్పించండి.
  5. మంగళగౌరి పూజలో ఏడు రకాల ధాన్యాలు, ఐదు రకాల పండ్లు, 16 పువ్వులను ఉంచండి. పూజ సమయంలో ఈ వస్తువులన్నీ అమ్మవారికి సమర్పించండి.
  6. మంగళ గౌరీ వ్రతం సమయంలో కథను చదవండి. చివరలో శివ పార్వతులకు హారతిని ఇవ్వండి. రోజంతా ఉపవాసం ఉండండి. మంగళ గౌరీ వ్రతం సమయంలో ‘ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని భక్తిశ్రద్దలతో పఠించడం. శివపార్వతులను సంతోషపరుస్తుంది.

ఉద్యాపన లేని మంగళ గౌరీ వ్రతం అసంపూర్ణం

సంతోషం, అదృష్టం కోసం ఆచరించే మంగళ గౌరీ వ్రతం ఉద్యాపన లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం ఉద్యాపన కూడా శ్రావణ మాసంలోనే చేయాల్సి ఉంటుంది. విశ్వాసం ప్రకారం మంగళ గౌరీ దేవి వ్రతాన్ని ఆచరించి ఉపవాసాన్ని ఆచరించిన తరువాత 17 వ రోజున లేదా 21 వ రోజున ఉద్యాపన చేయాల్సి ఉంది. మంగళ గౌరీ దేవీ వ్రతం ఉద్యాపన శ్రావణమాసంలో శుక్ల పక్షంలో ఏదైనా మంగళవారం చేయవచ్చు, అప్పుడే మంగళ గౌరీ వ్రతం యొక్క పూర్తి ఫలితాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)