AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photo Vastu Tips: మీ పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో పదిల పరచుకుంటున్నారా.. ఏ దిశలో ఫోటోలు ఏర్పాటు చేసుకోవాలంటే..

ఫోటోల్లో చిన్ననాటి జ్ఞాపకాలను పదిల పరుచుకుంటారు. అవి చూడడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. సొంత ఇంటివారికైతే ఆనందంగా ఉంటుంది. అయితే గదుల్లో పెట్టుకునే ఫోటోల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. వాస్తు శాస్త్రంలో పిల్లల ఫోటోలను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు పేర్కొనబడ్డాయి.

Photo Vastu Tips: మీ పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో పదిల పరచుకుంటున్నారా.. ఏ దిశలో ఫోటోలు ఏర్పాటు చేసుకోవాలంటే..
Photo Vastu Tips
Surya Kala
|

Updated on: Aug 28, 2023 | 9:51 AM

Share

ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే ఎవరికైనా ఆ ఇంటిలోని వస్తువులు, అలంకరణ ఆకర్షిస్తుంది. అది కుటుంబ సభ్యులకైనా, బంధువులు, స్నేహితువులను అయినా ముందుగా ఆకట్టుకునేది ఆ ఇంటి అలంకరణ. అందుకనే గదులను అలంకరించేటప్పుడు.. వస్తువులతో పాటు ఇంటి సభ్యుల ఫోటోలను కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా ఇంటి గోడలపై పిల్లల చిత్రాలను పెట్టుకుంటారు. ఈ ఫోటోల్లో చిన్ననాటి జ్ఞాపకాలను పదిల పరుచుకుంటారు. అవి చూడడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. సొంత ఇంటివారికైతే ఆనందంగా ఉంటుంది. అయితే గదుల్లో పెట్టుకునే ఫోటోల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలున్నాయి. వాస్తు శాస్త్రంలో పిల్లల ఫోటోలను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు పేర్కొనబడ్డాయి. ఈ నియమాలను దృష్టిలో ఉంచుకుని ఇంట్లో పిల్లల చిత్రాలను పెడితే ఇంట్లో వాతావరణం చక్కగా ఉంటుంది. తెలుసుకుందాం.

పశ్చిమ దిశ: ఇంటి పశ్చిమ దిశ పిల్లల సృజనాత్మకతతో ముడిపడి ఉంటుంది. ఈ దిశలో పిల్లల ఫోటోలను ఉంచడం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. ఈ దిశలో పిల్లల ఫోటోలను ఉంచడం వల్ల వారు చదువులో చురుగ్గా ఉంటారు. జీవితంలో ఎల్లప్పుడూ పురోగతి సాధిస్తారు.

దక్షిణ దిశ : దంపతులకు ఒక్కడే సంతానం ఉంటే.. అతని ఫోటోను దక్షిణాన ఉంచవచ్చు. ఇలా చేయడం ద్వారా, పిల్లవాడు బాధ్యతాయుతంగా ఉంటాడని నమ్మకం.. అంతేకాదు కుటుంబానికి బాధ్యత వహించవచ్చు. ఈ దిశ ఇంటి యజమానితో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు ఈ దిశలో ఒకే సంతానం ఉన్న పిల్లల ఫోటోలు  ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి

తూర్పు దిశ: తూర్పు దిశలో పిల్లల ఫోటోను ఉంచడం వలన అతను తెలివైన, శక్తివంతంగా ఉంటాడు. జీవితంలో మంచి ఎత్తుకు చేరుకోవచ్చు. భగవంతుని దయ అతనిపై ఉంది.

ఈశాన్య దిశ: ఇంటి ఈశాన్య దిశలో పిల్లల ఫోటోలను పెట్టాలనుకుంటే.. మీరు మీ పిల్లలతో ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచాలి. కాబట్టి ఈ దిశలో ఫ్యామిలీ ఫోటోలు పెట్టడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో కుటుంబ ఫోటోలను ఉంచడం బంధాన్ని బలపరుస్తుందని నమ్ముతారు. పిల్లల్లో కుటుంబ బంధాలు బలపడి మాధుర్యం పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)