- Telugu News Photo Gallery Beauty Care Tips: Rice flour scrub brings natural glow on skin use like this in Telugu
Rice Flour Scrub: బియ్యం పిండి కూడా మంచి స్కిన్ స్క్రబ్బర్ అని తెలుసా.. సింపుల్ టిప్స్ మీ కోసం
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్క్రబ్బింగ్ కూడా చాలా ముఖ్యం. చర్మాన్ని స్క్రబ్ చేయడానికి అనేక సహజమైన వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. స్కిన్ స్క్రబ్బింగ్ కోసం బియ్యం పిండిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పిండితో ఇంట్లోనే రకరకాలుగా స్క్రబ్స్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ చర్మంపై ఉన్న మృత కణాలు తొలగి గ్లో సంతరించుకుంటుంది.
Updated on: Aug 26, 2023 | 12:22 PM

బియ్యం పిండిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి గుణాలు ఉన్నాయి. ఈ స్క్రబ్ చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. బియ్యం పిండితో చేసిన స్క్రబ్ మీ చర్మానికి సహజమైన మెరుపును తెస్తుంది. ఇంట్లోనే బియ్యం పిండితో స్క్రబ్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బియ్యం పిండి స్క్రబ్: ఒక గిన్నెలో సుమారు 5 స్పూన్ల బియ్యప్పిండిని తీసుకోండి. దానికి కొంచెం నీళ్ళు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేయండి. మీరు 10 నిమిషాల తర్వాత చర్మం నుండి ఈ స్క్రబ్‌ను తొలగించవచ్చు. ఈ స్క్రబ్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల ముఖంలో మెరుపు వస్తుంది.

కలబంద, బియ్యం పిండి: ఒక గిన్నెలో 5 స్పూన్ల బియ్యప్పిండి తీసుకోండి. దానికి అలోవెరా జెల్ కలపండి. అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చర్మాన్ని మసాజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్‌తో చర్మాన్ని మసాజ్ చేసుకోండి. కొన్ని నిమిషాల తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోండి.

బియ్యం పిండి, పాలు: ఒక గిన్నెలో 4 చెంచాల బియ్యప్పిండి తీసుకోండి. దీనికి కొంచెం పాలు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో చర్మాన్ని స్క్రబ్ చేయండి. అనంతరం మసాజ్ చేసిన తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా ఈ మిశ్రమంతో చర్మానికి ఈ స్క్రబ్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.

తేనె, బియ్యం పిండి: ఒక గిన్నెలో సుమారు నాలుగు చెంచాల బియ్యప్పిండి తీసుకోండి. దానికి కొంచెం తేనె కలిపి పేస్ట్‌ను సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై గుండ్రంగా మసాజ్ చేసి ముఖంపై 10 నిమిషాల పాటు ఉంచుకుని తర్వాత శుభ్రం చేసుకోండి.

బియ్యం పిండి, పెరుగు: ఒక గిన్నెలో 5 స్పూన్ల బియ్యప్పిండి తీసుకోండి. దీనికి కాస్త పెరుగు జోడించండి. ఈ మిశ్రమాన్ని చర్మం.. మెడపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేసిన తర్వాత తొలగించండి. ఈ రైస్ స్క్రబ్ మీ ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది.





























