- Telugu News Photo Gallery Cinema photos Ravi Teja Starrer Tiger Nageswara Rao, Eagle Pan India Movies Ready To Hit Screens On Dasara And Sankranthi
Ravi Teja: కుమ్మేస్తున్న మాస్ మహారాజా.. లైన్‌లో రెండు పాన్ ఇండియా మూవీస్.. కెరీర్‌లో తొలిసారిగా.!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు బడా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. అందులో ఒకటి టైగర్ నాగేశ్వరరావు కాగా.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Ravi Kiran
Updated on: Aug 27, 2023 | 9:30 AM

మన తర్వాత వచ్చినవాడు.. మనల్ని రేసులో దాటేసి ముందుకెళ్తుంటే ఎలా ఉంటుంది..? ఈర్ష్య ఉంటుందా లేదా అనే మ్యాటర్ పక్కనబెడితే.. ఎలాగైనా వాన్ని దాటేయాలనే కసి అయితే ఉంటుంది కదా..? ఇప్పుడు రవితేజలో ఇదే కనిపిస్తుంది. తన ఎక్స్‌పీరియన్స్‌లో సగం కూడా లేని హీరోలు బిజినెస్‌లో మాస్ రాజాను క్రాస్ చేసారు. దాంతో అర్జంట్‌గా ఆ కసితో పాటు.. వాళ్ల బాకీ తీర్చేయాలని చూస్తున్నారు రవితేజ.

హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలు చేయడం మాత్రమే రవితేజకు తెలుసు. మార్కెట్, బిజినెస్ అంటూ పెద్ద పెద్దగా ఆలోచించడం కూడా ఈయనకు అలవాటు లేదు. కానీ అందరూ మారుతున్నప్పుడు తాను కూడా మారాలిగా అంటున్నారు రవితేజ. అందుకే మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. ఈ పని టైగర్ నాగేశ్వరరావుతోనే మొదలు పెడుతున్నారు. ఇది ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

రవితేజ జోన్‌లోనే ఉన్న నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు ఇప్పటికే 50 కోట్ల షేర్ అందుకున్నారు. వాళ్ల సినిమాలకు 50 కోట్ల బిజినెస్ కూడా జరిగింది. కానీ అంత అనుభవం ఉండి.. బోలెడంత మాస్ ఇమేజ్ ఉన్న రవితేజ సినిమాలు మాత్రం ఇప్పటివరకు 50 కోట్ల షేర్ అందుకోలేదు.. ధమాకా దగ్గరికి వచ్చినా.. 50 కోట్లు చేరుకోలేదు. ఇక వాల్తేరు వీరయ్య చిరు ఖాతాలోకి వెళ్లిపోయింది.

టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా.. వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది. మాస్ రాజా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ దీనికి మంచి ఆఫర్లే వస్తున్నాయి. దసరాకు లియో, భగవంత్ కేసరితో పాటు విడుదల కానుంది టైగర్ నాగేశ్వరరావు. మరి చూడాలిక.. ఈ సినిమాతో రవితేజ ఏం చేస్తారో.?

కాగా, మాస్ రాజా రవితేజ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఒకటి టైగర్ నాగేశ్వరరావు కాగా, మరొకటి ఈగిల్ తన ఖాతాలో ఉన్నాయి. టైగర్ నాగేశ్వరరావు ఈ ఏడాది విడుదల కానుండగా.. ఈగిల్ వచ్చే ఏడాది సమ్మర్‌కు రిలీజ్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు మేకర్స్..





























