- Telugu News Photo Gallery Cinema photos Tamannaah Bhatia Says About Her Beauty and Fitness Secrets Full details here telugu cinema news
Tamannaah Bhatia: మిల్కీబ్యూటీ అందానికి రహస్యం ఇదే.. ఫిట్నెస్ పై తమన్నా చెప్పిన సీక్రెట్స్ ఏంటో తెలుసా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది తమన్నా. దాదాపు 18 సంవత్సరాలు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ఇటీవలే భోళా శంకర్, జైలర్ సినిమాలతో వెండితెరపై సందడి చేసింది ఈ బ్యూటీ. తెలుగు, హిందీ, తమిళంలో భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. దాదాపు 18 ఏళ్లుగా నటిగా సినీ ప్రియులను అలరిస్తుంది.
Updated on: Aug 27, 2023 | 8:23 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది తమన్నా. దాదాపు 18 సంవత్సరాలు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ఇటీవలే భోళా శంకర్, జైలర్ సినిమాలతో వెండితెరపై సందడి చేసింది ఈ బ్యూటీ.

తెలుగు, హిందీ, తమిళంలో భాషల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. దాదాపు 18 ఏళ్లుగా నటిగా సినీ ప్రియులను అలరిస్తుంది. ఇక రోజు రోజుకు తమన్నా అందం పెరుగుతూనే ఉందని. ఇటీవల విడుదలైన జైలర్ చిత్రంలో మరింత అందంగా కనిపించి మైమరపించారు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన అందానికి రహాస్యం చెప్పేశారు. ఈ గ్లామర్ ప్రపంచంలో ఫిట్ గా ఉండడం చాలా అవసరమని అన్నారు. అందుకు జిమ్ వర్కవుట్స్ చేయడమే కాకుండా ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు.

ఉదయం నట్స్, ఖర్జూరపండ్లు, అరటి పండ్లను సమానంగా తీసుకుంటానని.. మధ్యాహనం భోజనంలో బ్రౌన్ రైస్, పప్పు, కాయకూరలు తీసుకుంటానని అన్నారు. అదే విధంగా సాయంత్రం 5.30 వరకు డిన్నర్ ముగించేస్తాని.. ఆ తర్వాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తిననని అన్నారు.

ఇలా 12 గంటలు ఏమి తినకుండా ఉంటానని.. దీంతో తన చర్మం కాంతులనుతుందని.. అంతేకాకుండా హెల్తీ, ఫిట్ గా ఉంటానని అన్నారు తమన్నా. అలాగే గ్రీన్ టీ, ఆమ్లా జ్యూస్ వంటివి తన ఆరోగ్య రహస్యంలో ఒక భాగమంటూ చెప్పుకొచ్చారు మిల్కీబ్యూటి.





























