- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor Playing De glamor role in Jr NTR's Devara movie telugu cinema news
Janhvi Kapoor: డీగ్లామర్ రోల్లో కనిపించబోతున్న జాన్వీ కపూర్.. దేవర సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండనుందంటే..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు జాన్వీ. ధడక్ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన ఆమె.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. నటిగా ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆమెకు బీటౌన్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటివరకు విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. అది కూడా ఆమె ఎంతో అభిమానించే హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
Updated on: Aug 26, 2023 | 9:45 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు జాన్వీ. ధడక్ సినిమాతో కథానాయికగా అడుగుపెట్టిన ఆమె.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు.. నటిగా ప్రశంసలు అందుకున్నారు. దీంతో ఆమెకు బీటౌన్ లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

ఇప్పటివరకు విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. అది కూడా ఆమె ఎంతో అభిమానించే హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న దేవర చిత్రంలో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ పాత్ర గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇందులో జాన్వీ ఢీగ్లామరస్ గా ఉండబోతుందట. మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుందని టాక్. ఇక జాన్వీ పాత్రలో కొద్దిపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని.. ఇప్పటికే ఆమె షూటింగ్ లోనూ పాల్గొంటుందని టాక్.

ఇందులో జాన్వీ ఢీగ్లామరస్ గా ఉండబోతుందట. మత్స్యకారుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించనుందని టాక్. ఇక జాన్వీ పాత్రలో కొద్దిపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని.. ఇప్పటికే ఆమె షూటింగ్ లోనూ పాల్గొంటుందని టాక్.





























