పాన్ ఇండియా క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు అన్ని భాషల్లో విడుదలై సంచలనం సృష్టస్తున్నాయి. బాహుబలి సినిమాతో డైరెక్టర్ రాజమౌళి స్టార్ట్ చేసిన ఈ ట్రెండ్..ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కొనసాగుతుంది. ఇప్పటికే కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, పుష్ప, కాంతారా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్, కల్కి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.